Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 1709 తర్వాత అతిపెద్ద క్షీణత
లండన్ : బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ గడిచిన 300 ఏండ్లలో ఎప్పుడూ లేని స్థాయిలో పతనాన్ని చవి చూసింది. కరోనా సంక్షోభంతో 2020లో బ్రిటన్ జీడీపీ ఏకంగా మైనస్ 11 శాతం క్షీణించినట్లు ఆ దేశ ప్రభుత్వం గణంకాలను వెల్లడించింది. ఇది 1709 మహా సంక్షోభం తర్వాత అతిపెద్ద పతనమని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ తెలిపింది. అప్పటి తొలి ప్రపంచ యుద్దం కాలంలో ఆ దేశ జీడీపీ అమాంతం పడిపోయింది. ప్రస్తుతం జీ7 దేశాల ఆర్థిక వ్యవస్థలతోనూ పోల్చినా బ్రిటన్ వృద్థి భారీగా క్షీణించింది. బ్రిటన్ తర్వాత స్పెయిన్ 10.8 శాతం ప్రతికూల వృద్థిని చవి చూసింది. వైద్య రంగానికి భారీ కేటాయింపులు, వ్యయాలు చేయడంతో ఆర్థిక వ్యవస్థ ఒత్తిడిని ఎదుర్కొందని బ్రిటన్ నేషనల్ స్టాటిస్టిక్స్ పేర్కొంది. 2021 నవంబర్ నుంచి తిరిగి ఆర్థిక వ్యవస్థ రికవరీలోకి వచ్చింది. అయినప్పటికీ ఆ దేశంలో ద్రవ్యోల్బణం వేగంగా పెరుగుతోంది. దీంతో ఈ ఏడాది చివరి నాటికి బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ సంక్షోభాన్ని ఎదుర్కొనే అవకాశాలున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.