Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రముఖ అమెరికన్ టెక్ దిగ్గజం ఆపిల్ కంపెనీ భారత్‌లో తన ఐఫోన్ 14 ఫోన్లను తయారు చేయనుందని రిపోర్టులు వస్తున్నాయి. వచ్చే ఏడాది అక్టోబర్ నుంచి భారత్‌లో 'మేడిన్ ఇండియా ఫోన్ల' ఉత్పత్తిని ప్రారంభించనుందని సమాచారం. ప్రస్తుతం ఈ సంస్థ చెన్నరులో కొన్ని రకాల ఐఫోన్లను నామమాత్రమపు అసెంబ్లింగ్ చేస్తోంది. కానీ పూర్తి స్థాయిలో కార్యకలాపాలు నిర్వహించడం లేదు. కాగా.. విదేశాల్లో మరికొన్ని రోజుల్లో ఐఫోన్ 14ను తయారీని ప్రారంభించనుంది. ఈ ఉత్పత్తులను భారత్‌లోకి దిగుమతి చేయడానికి 6-9 నెలల వరకు సమయం పడుతుంది. ఈ కాలాన్ని తగ్గించడానికి చెన్నరు ఫ్లాంట్‌లో ఐఫోన్ -14 ల తయారీపై ఆపిల్‌తో పాటు ఫాక్స్ కాన్ అధ్యయనం చేస్తున్నట్టు సమాచారం.