Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ప్రముఖ కండ్లజోళ్ల బ్రాండ్ లెన్స్కార్ట్ హైదరాబాద్లో తన లెన్స్కార్ట్ ఎట్ హోమ్ వ్యాపారంలో 200 శాతం వృద్థిని నమోదు చేసినట్లు ప్రకటించింది. గడిచిన రెండేండ్లలో ఈ పెరుగుదల నమోదయ్యిందని తెలిపింది. ఈ నగరంలో తమకు దాదాపుగా 35 మంది సర్టిఫైడ్ ఐ స్పెషలిస్ట్లు ఉన్నారని తెలిపింది. వీరు ప్రతీ నెల 3000కు పైగా కండ్ల జోళ్లను అందించడంతో పాటుగా 4వేలకు పైగా ఇంటి వద్దకే సేవలు అందిస్తున్నారని పేర్కొంది.