Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అక్యూట్ రేటింగ్స్ అంచనా
న్యూఢిల్లీ : దేశంలో చోటు చేసుకుంటున్న అధిక ద్రవ్యోల్బణం నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రెపోరేటును మరో 50-60 బేసిస్ పాయింట్లు పెంచే అవకాశం ఉందని అక్యూట్ రేటింగ్స్ అండ్ రీసెర్చ్ అంచనా వేసింది. ఆగస్టు తొలి వారంలో జరిగిన ఆర్బీఐ ఎంపీసీ భేటీలో హెచ్చు ద్రవ్యోల్బణంపై ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో మరో దఫా పెంపు ఉండొచ్చని అక్యూట్ రేటింగ్స్ అండ్ రీసెర్చ్ నిపుణులు సుమన్ చౌదరీ పేర్కొన్నారు. ఇప్పటికే ప్రపంచ దేశాలు వడ్డీ రేట్లను పెంచుతున్నాయని.. వచ్చే కొన్ని నెలల్లోనూ ఈ ప్రక్రియ ఉండొచ్చన్నారు. ఈ క్రమంలో ఆర్బీఐ కూడా అదే తరహా విధానాన్ని అవలంభించొచ్చన్నారు.