Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ:వినూత్న ఆలోచనతో ఆరంభమై..రియల్ ఎస్టేట్ రంగంలోనే తనదైన ఒరవడి సృష్టిస్తూ .. విలక్షణ రీతిలో పురోగమిస్తున్న ' సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ ' సంస్థ.. హైదరాబాద్ నగరంలోని ఎస్ఆర్నగర్ సమీపంలో సోమవారం తన నూతన బ్రాంచ్‌ను ప్రారం భించింది. సంస్థ చైర్మెన్ శ్రీ సాయి శ్రీనివాస్ ఈ నూతన బ్రాంచ్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడు తూ 2006వ సంవత్సరంలో ఓ సాధారణ రియల్ ఎస్టేట్ సంస్థగా సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్‌ను ప్రారంభించామని , ఈ వ్యాపారానికి విభిన్నతను, వైవిధ్యాన్ని జోడించి 2017వ సంవత్సరంలో ఎర్రచందనం ప్లాంటేషన్‌తో కూడిన ఫార్మ్ ల్యాండ్ విక్రయ వ్యాపారాని కి శ్రీకారం చుట్టామని అన్నారు. ' ఇంతింతై వటుడింతై ' రీతిలో అనతి కాలంలోనే అంచెలంచెలుగా అభివృద్ధి చెంది, ఈ రంగంలోనే నం.1 స్థానానికి ఎదిగామనీ , సమిష్టి కృషి, పట్టుదల, చక్కని ప్రణాళిక, కఠిన పరిశ్రమ అన్నిటికీ మించి ప్రజల ఆదరణ.. తమకు ఈ స్థాయినీ, స్థా నాన్ని అందించాయని తెలిపారు. '' నేడు భూమిని విక్రయించడం ద్వారా వ్యాపారం చేసే సంస్థలున్నాయి. ఓ కాన్సెప్ట్‌ను విక్రయించడం ద్వారా వ్యాపారం చేసే సంస్థలున్నాయి. ఓ వస్తువుని లేదా ఉత్పత్తిని విక్రయించడం ద్వారా వ్యాపారం చేసే సంస్థలున్నాయి. ఈ మూడిం టినీ మేళవించి.. అంటే భూమిని ప్లాట్లుగా చేసి ఎర్ర చందనం మొక్క లనే ఉత్పత్తులుగా చేసి ఆ మొక్కల పెంపకాన్నే ఓ కాన్సెప్టుగా మల చి వినూత్నమైన రీతిలో వ్యాపారాన్ని నిర్వహిస్తూ కస్టమర్లకు చక్కని లాభాలనందిస్తూ వారి అభివృద్ధికి బాటలు వేసే ఒకే ఒక విలక్షణమై న, నమ్మకమైన వ్యాపార సంస్థ సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ లిమి టెడ్ అని అన్నారు. అమితమైన ప్రజాదరణతో అద్భుతమైన అభి వృద్ధిని సాధించి విజయవంతంగా 17వ వసంతంలోకి అడుగు పెట్టా మనీ, ఇటీవలే ఘనంగా 16వ వార్షికోత్సవం జరుపుకున్నామనీ తెలి పారు. ఎర్రగడ్డలో ప్రారంభించిన ఈ బ్రాంచ్.. హైదరాబాద్‌లో తమ తొలి సొంత బ్రాంచ్ అని అన్నారు. కార్యక్రమంలో సంస్థ మార్కె టింగ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ రాఘవేంద్ర రావు , సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.