Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ప్రముఖ ప్రీమియం బైకుల తయారీదారు రాయల్ ఎన్ఫీల్డ్ తెలుగు రాష్ట్రాల మార్కెట్లోకి కొత్త హంటర్ 350 బైకులను విడుదల చేసింది. బుధవారం హైదరాబాద్లో హంటర్ 350లో రెట్రో, మెట్రో వేరియంట్లను ఆ కంపెనీ ఇండియా బిజినెస్ మార్కెట్స్ హెడ్ హెడ్ వి జయప్రదీప్ వీటిని ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ చెన్నరు ఎక్స్ షోరూం వద్ద వీటి ప్రారంభ ధరను రూ.1,49,000గా నిర్ణయించామన్నారు. ఈ కొత్త బైకులు లీటర్కు 36.2 కిలోమీటర్ల మైలేజీ ఇస్తాయన్నారు. భారత్లో 250 సిసి సెగ్మెంట్లో రాయల్ ఎన్ఫీల్డ్ 85 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉందన్నారు. తెలంగాణలో తమ సంస్థ 70, ఆంధ్రప్రదేశ్లో 110 చొప్పున అవుట్లెట్లను కలిగి ఉందన్నారు. గతేడాది మొత్తంగా 5.7 లక్షల యూనిట్లను విక్రయించామన్నారు. ఈ ఏడాది రెండంకెల వృద్థి అంచనా వేస్తున్నామన్నారు. ఇవి రంగంలోని అవకాశాలపై తమ కంపెనీ నిపుణులు అధ్యయనం చేస్తున్నారన్నారు.