Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగంలోని ఐడీబీఐ బ్యాంక్‌లోని 51 శాతం వాటాను విక్రయించే ప్రక్రియ వేగవంతమయ్యిందని తెలుస్తోంది. ఈ సంస్థలో ప్రస్తుతం కేంద్రానికి 45.48 శాతం, ఎల్ఐసీకి 49.24 శాతం చొప్పున వాటాలున్నాయి. కాగా.. ఇందులోని మెజారిటీ వాటాలను సెప్టెంబర్ ముగింపు నాటికి విక్రయించడానికి చర్చలు జరుగుతున్నాయని అధికార వర్గాలు తెలిపాయి. ఎంత వాటాను విక్రయించాలన్న విషయమై కేంద్ర మంత్రుల బృందం త్వరలోనే తుది నిర్ణయం తీసుకోనుందని ఆర్థిక శాఖ అధికారి ఒక్కరు తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణపై ప్రజల నుంచి వస్తోన్న తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో గత కొన్ని నెలలుగా ఈ విషయంలో మోడీ సర్కార్ స్తబ్దుగా ఉంది.