Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడి
హైదరాబాద్ : ప్రభుత్వ రంగంలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ ఖాతాదారులకు మరింత చేరువ కావడానికి 'డిజిటల్ బ్యాంక్'ను అందుబాటులోకి తెస్తోన్నట్లు ప్రకటించింది. దీంతో ఖాతాదారుల బ్యాంకింగ్ అవసరాలను తీర్చడంతో పాటుగా వారికి సాధికారత కల్పించడానికి వీలు కానుందని పేర్కొంది. సులభంగా లావాదేవీలు, మొత్తం బ్యాంక్ వ్యాపారాలు డిజిటలైజేషన్, సాంప్రదాయ పద్దతి నుంచి డిజిటల్ వేదిక వైపు మళ్లింపు దీని ఉద్దేశ్యాలని తెలిపింది. అత్యంత భద్రతతో డిజిటల్ బ్యాంక్‌ను రూపొందించినట్లు పేర్కొంది. దీన్ని దశల వారిగా అమల్లోకి తీసుకురానున్నట్టు తెలిపింది. ప్రస్తుత ఖాతాదారులు, యువత ఎలాంటి ఇబ్బందులు లేకుండా బ్యాంక్ ఉత్పత్తి సేవలను పొందవచ్చని ఆ బ్యాంక్ యండీ, సీఈఓ ఎంవి రావు తెలిపారు. ఇది గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాల్లోని ఖాతాదారులకు తమను మరింత చేరువ చేయడానికి దోహదం చేయనుందన్నారు. ఈ డిజిటల్ బ్యాంక్ కార్యక్రమంలో ఆ బ్యాంక్ ఉన్నతాధికారులు అశోక్ శ్రీవాస్తవా. వివేక్ వాహి, రాజీవ్ పూరి, రతన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.