Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉబెర్ 2021 ఆర్ధిక ప్రభావ నివేదిక చూపే దాని ప్రకారం గిగ్ ఆర్ధిక వేదిక పై పరివర్తక ప్రభావం చూపింది.
2021లో భారతీయ రైడర్లు ఉబెర్‌తో కలిసి ప్రయాణించడం వల్ల వారికి ఉబెర్ 1.5 ట్రిలియన్ రూపాయలను ఆదా చేసింది.
అంచనాల ప్రకారం, సంవత్సరానికి 16.8 కోట్ల గంటల సమయంను రైడర్లకు ఉబెర్ ఆదా చేసింది.
ఉబెర్‌ను వినియోగించడంలో భద్రత అనేది అతి ముఖ్యమైన అంశంగా 97 శాతం మంది మహిళా రైడర్లు వెల్లడిస్తున్నారు
తమ డ్రైవర్ భాగస్వాములు అదనంగా 1700 కోట్ల అధిక ఆదాయం సంపాదించేందుకు ఉబెర్ సహాయపడింది.
ఢిల్లీ ఎన్సీఆర్: పబ్లిక్ ఫస్ట్ సంకలనం చేసిన ఉబెర్ 2021 ఇండియా ఎకనమిక్ ఇంపాక్ట్ రిపోర్ట్ (2021 ఇండియా ఆర్థిక ప్రభావ నివేదిక ) లో ఏ విధంగా రైడర్లు, డ్రైవర్లు మరియు విస్తృత శ్రేణిలో కమ్యూనిటీకి 44,600 కోట్ల రూపాయలను భారతీయ ఆర్ధిక వ్యవస్ధ కోసం 2021లో సృష్టించడం ద్వారా ఆన్ డిమాండ్ ఆర్థిక వ్యవస్థను సమూలంగా మార్చడంలో సహాయపడినది వెల్లడించింది.
ఈ ఆర్ధిక తోడ్పాటు మరియు భద్రత మెరుగుపరచడం, పరిశ్రమ యొక్క సస్టెయినబిలిటీ వెనుక ఉన్న అంశాలను గురించి లోతుగా ఈ నివేదిక చర్చించింది.
ఈ నివేదికలో కనుగొన్న కీలకాంశాలు :
భారతీయ ఆర్ధిక వ్యవస్థకు దాదాపు 44,600 కోట్ల రూపాయల ఆర్ధిక విలువను ఉబెర్ సృష్టించిందని అంచనా.
2021లో ఉబెర్ దాదాపు 1.5 ట్రిలియన్ రూపాయలను వినియోగదారులకు ఆదా చేసింది. ఇది జీడీపీలో 0.8%కు సమానం
డ్రైవర్లు , రైడర్లు మరియు కమ్యూనిటీలపై ప్రభావం
96% మంది రైడర్లు చెప్పేదాని ప్రకారం, ఉబెర్‌ను తాము వినియోగించడానికి ప్రధాన కారణం సౌకర్యం. సాధారణ సంవత్సరంలో మేము అంచనా వేసిన దాని ప్రకారం రైడర్లకు 16.8 కోట్ల గంటల సమయం ఆదా చేసింది. నిజానికి, భారతీయ రైడర్లు చెప్పేదాని ప్రకారం, రైడ్ షేరింగ్ అనేది అత్యంత ముఖ్యమైన రవాణా ఆవిష్కరణగా పేర్కొంటున్నారు. గత దశాబ్ద కాలంలో వారు చూసిన మహోన్నత రవాణా ఆవిష్కరణ అని చెబుతున్నారు.
మొత్తంమ్మీద 2021లో, డ్రైవర్ భాగస్వాములు అదనంగా 1700 కోట్ల రూపాయలను ఓ సంవత్సరంలో అదనంగా ఉబెర్ ద్వారా సంపాదించగలిగారు. ఇంకో రకంగా చెప్పాలంటే, వారు అత్యుత్తమ ప్రత్యామ్నాయ పనితో పోలిస్తే 49% అదనంగా సంపాదించగలిగారు.
భద్రత మరియు మెరుగైన ప్రాప్యత
97% మంది మహిళా రైడర్లు వెల్లడించే దాని ప్రకారం, ఉబెర్ వినియోగించడానికి అతి ముఖ్యమైన కారణాలలో ఒకటిగా భద్రత నిలుస్తుంది. మరియు 76% మంది మహిళా రైడర్లు అంగీకరించే దాని ప్రకారం రాత్రిళ్లు ఆలస్యమైనా నిర్భయంగా, అతి సులభంగా ఉబెర్‌తో ఇంటికి చేరగలుగుతున్నాము.
కారు వినియోగించని 84% మంది రైడర్లు చెప్పేదాని ప్రకారం ఉబెర్‌లాంటి రైడ్ షేరింగ్ సేవల లభ్యత కారణంగానే తాము సొంత వాహనం దిశగా ఆలోచన చేయడం లేదని వెల్లడించారు
మొత్తంమ్మీద, మేము అంచనా వేసిన దాని ప్రకారం ప్రతి 4 ఉబెర్ ట్రిప్స్‌లో ఒకటి ప్రజా రవాణాకు అనుసంధానమై ఉంటుంది.
ఈ నివేదిక గురించి ఉబెర్ ఇండియా అండ్ సౌత్ ఆసియా అధ్యక్షుడు ప్రబ్జీత్ సింగ్ మాట్లాడుతూ 'భారతదేశంలో గత తొమ్మిది సంవత్సరాలుగా మా ప్రయాణం మన ఆర్ధిక వ్యవస్ధకు గణనీయమైన తోడ్పాటును అందించడం పట్ల చాలా సంతోషంగా ఉన్నాము. 2021లో భారతదేశంలో కొవిడ్ కారణంగా సవాల్‌తో కూడిన పరిస్థితులు ఉన్నప్పటికీ , భారతీయ ఆర్ధిక వ్యవస్ధకు దాదాపు 446 బిలియన్ రూపాయల ఆర్థిక విలువను ఉబెర్ అందించింది. మేము అందించిన తోడ్పాటు పట్ల మేము చాలా ఆనందంగా ఉన్నాము. ఉబెర్ ప్లాట్‌ఫామ్‌పై చేసే ప్రతి సవారీతోనూ అర్థవంతమైన మార్పును తీసుకురావడానికి కట్టుబడి ఉన్నాము్ణ్ణ అని అన్నారు.
మీరు ఈ నివేదిక పూర్తి పాఠాన్ని, ఈ నివేదిక రూపకల్పనలో అనుసరించిన పద్ధతులను సైతం https://uberapac.publicfirst.co.uk/india/ వద్ద వీక్షించవవచ్చు.
'ఆర్ధిక సంక్షేమానికి అత్యంత ముఖ్యమైన కొలమానాలలో ఒకటిగా – స్వచ్ఛందంగా మీరు ఒక వ్యక్తికి ఓ వస్తువు లేదా సేవకు చెల్లించే మొత్తాన్ని పరిగణిస్తుంటారు. ఒకవేళ ఓ వస్తువుకు జీరో కన్స్యూమర్ సర్ప్లస్ ఉంటే, దానిని మనం తీసుకోవచ్చు లేదా వదిలి వేయవచ్చు – అదే ఆ వస్తువుకు అత్యధిక కన్స్యూమర్ సర్ప్లస్ ఉంటే అది మన జీవితాలలో అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది.