Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డిజిటల్ పేమెంట్ పద్ధతుల వ్యాప్తి మన జీవితాలను సులభతరం చేసింది. డబ్బును పంపేందుకు లేదా అంగీకరించేందుకు, మీ అన్ని రకాల బిల్లులను చెల్లించేందుకు, మొబైల్/డీటీహెచ్ తదితరాలను రీఛార్జ్ చేసేందుకు, ఆన్ లైన్ షాపింగ్ చేసేందుకు, స్థానిక కిరాణా దుకాణాలలో తక్షణ పేమెంట్లు చేసేందుకు వీలుండడం వల్ల డబ్బు తో ఆధారపడాల్సిన పని లేకుండా చేసింది..
డిజిటల్ పేమెంట్ పద్దతులు మనకు ఒక గొప్ప వరం అయినప్పటికీ, కస్టమర్లనే కాక, రిటైల్ మర్చంట్లను కూడా మోసగించేందుకు, అలాగే నకిలీ లావాదేవీలకు కూడా పాల్పడేందుకు కొత్త మార్గాలను మోసగాళ్లు నిరంతరం అన్వేషిస్తున్నారు.
సాధారణంగా జరిగే కొన్ని మోసపూరిత సన్నివేశాలతో పాటు మోసగాళ్ల లక్ష్యాలకు గురి కాకుండా ఉండేందుకు దృష్టిలో పెట్టుకోవాల్సిన అంశాల గురించి మర్చంట్లకు అవగాహన కల్పించడం PhonePe చేస్తున్న ప్రయత్నమే ఇది.
స్క్రీన్ షేరింగ్ యాప్ ద్వారా జరిగే మోసాలు
మోసగాళ్లు పేమెంట్ కంపెనీల ప్రతినిధులమనే వేషంతో మర్చంట్ యొక్క రోజువారీ సేల్స్ చెక్ చేయాలనే నెపంతో కాల్ చేస్తారు.సంభాషణ సందర్భంగా మోసగాళ్లు మర్చంట్ యొక్క కార్డు లేదా బ్యాంక్ ఖాతా వివరాలను సంపాదించుకోవడం లేదా మర్చంట్ ఫోన్ ను తమ ఆధీనంలోకి తీసుకోవడం చేస్తారు. ఆ తర్వాత మర్చంట్ల కష్టార్జితాన్ని దోచుకునేందుకు ముందుకెళుతారు.
ఉదాహరణ:
మోసగాడు: నేను సేల్స్ సహాయ విభాగం నుండి కాల్ చేస్తున్నాను. కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా మేము గత కొన్ని రోజుల్లో మీ కస్టమర్లు చేసిన లావాదేవీలను రికార్డు చేయలేకపోయాము. అసౌకర్యానికి చింతిస్తున్నాము. ఆ సమస్యను సరి చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాము. దీనికోసం మీరు చేయాల్సింది:
మీ బ్యాంక్ ఖాతా/ డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డు వివరాలు / BHIM UPI పిన్
ఈ యాప్ ను ఇన్ స్టాల్ చేసుకునేందుకు కింది లింక్ పైన క్లిక్ చేయండంటాడు. మీకోసం సమస్యను మేము పరిష్కరించగలము. <Anydesk / ScreenShareలాంటి స్క్రీన్ షేరింగ్ యాప్ ను ఇన్ స్టాల్ చేసేందుకు లింక్ ను మోసగాడు మర్చంట్ కు పంపుతారు>
వారి విజ్ఞప్తికి లొంగిపోతున్న మర్చంట్ వివరాలు పంచుకుని, ఆ యాప్ ను ఇన్ స్టాల్ చేసుకుంటారు. దీంతో మర్చంట్ ఫోన్ పై మోసగాడు పెత్తనం చెలాయిస్తూ, డబ్బును దొంగిలిస్తారు.
క్యాష్ బ్యాక్ లేదా ఆఫర్ స్కీమ్ మోసాలు
పేమెంట్ భాగస్వాముల యొక్క మర్చంట్ ప్రతినిధులమని చెప్పుకుని, మర్చంట్లకు కొంత మంది మోసగాళ్లు కాల్ చేస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ ఆఫర్లతో మర్చంట్ ను తప్పుదోవ పట్టించే ఉద్దేశ్యంతో మోసగాలు ఈ కాల్ ప్రారంభిస్తారు.
ఉదాహరణ:
మోసగాడు — నేను మర్చంట్ సహాయ విభాగం నుండి కాల్ చేస్తున్నాను. ఈ వారం ఒక ప్రత్యేక క్యాష్ బ్యాక్ నడుస్తోంది. ఈ లింక్ కు పేమెంట్ చేసి, క్యాష్ బ్యాక్ మొత్తాన్ని నేరుగా మీ బ్యాంక్ ఖాతాలోకి పొందండి.
రూ.500 పేమెంట్ చేసి, రూ.1000 క్యాష్ బ్యాక్ పొందండి.
రూ.10,000 పేమెంట్ చేసి, రూ.15,000 క్యాష్ బ్యాక్ పొందండి.
ఈ ఆఫర్ కు లొంగుతున్న మర్చంట్ మొదటి లావాదేవీని చేసి, మోసగాడి నుండి రూ. 1000 అందుకుంటారు. ఆ తర్వాత ఇంకాస్త పెద్ద మొత్తాన్ని బదిలీ చేయాలని మర్చంట్ ను మోసగాడు కోరుతారు. మరింత పెద్ద క్యాష్ బ్యాక్ అందుతుందనే ఆశతో, మర్చంట్ రూ. 10,000లను బదిలీ చేస్తారు. అంతే సంగతులు. మోసగాడు కాల్ కట్ చేసి, మాయమవుతాడు.
Google ఫారాల ద్వారా మోసం
ఇందులో, వివిధ కారణాల చెబుతూ మోసగాడు బాధితునికి ఒక Google ఫారం పంపుతారు.
ఉదాహరణ:
మోసగాడు: నేను మర్చంట్ టీమ్ నుండి మాట్లాడుతున్నాను. మీ వివరాలలో కొన్ని మా సిస్టంలో అప్ డేట్ కాలేదని తెలియజేస్తున్నాము. అందువల్ల మీ ఖాతాను కొద్ది రోజుల పాటు సస్పెండ్ చేస్తున్నాము.ఇలా జరగకుండా నివారించడం కోసం దయచేసి లింక్ పైన క్లిక్ చేసి, మీ వివరాలతో ఇప్పుడు Google ఫారం నింపండి.
మర్చంట్ సంతృప్తి చెంది, ఆ ఫారాన్ని ఖాతా నెంబర్, UPI పిన్, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్, పేరు, ఇమెయిల్ ఐడి లాంటి వ్యక్తిగత/సున్నితమైన సమాచారంతో నింపుతారు. మోసగాళ్లు మర్చంట్ నింపిన ఈ సమాచారాన్ని ఉపయోగించుకుని, వారి డబ్బును దోచుకుంటారు.
గుర్తుంచుకోవాల్సిన అంశాలు:
పిన్ లను, OTPలను ఎన్నడూ పంచుకోవద్దు. అలాగే మీకు తెలియని వారి నుండి వచ్చే వసూలు అభ్యర్థనను అంగీకరించవద్దు.
తెలియని వ్యక్తుల నుండి వస్తే పే చేయవద్దు. అలాగే వసూలు అభ్యర్థనను అంగీకరించవద్దు.పేమెంట్ పంపవద్దు.
తెలియని వ్యక్తుల నుండి వస్తే ఆకర్షణీయమైన ఆఫర్లను లేదా ఉచితాలను అంగీకరించవద్దు.
ఎలాంటి పత్రాన్ని నింపడం మరియు బ్యాంక్ వివరాలు, పిన్ లాంటి సున్నితమైన సమాచారాన్ని అప్ డేట్ చేయడం వద్దు.
తెలియని వ్యక్తి లేదా మర్చంట్ నుంచి వసూలు అభ్యర్థనను అంగీకరించడం లేదా వారికి డబ్బు పంపడం చేసే ముందు పంపేవారి వివరాలకోసం చెక్ చేయండి.
డబ్బు అందుకునేందుకు మీ UPI పిన్ ను ప్రవేశపెట్టండి.
Never share identifiable information on Social Media platforms likeమోసగాడు ఉపయోగించే ట్విటర్, ఫేస్ బుక్ లాంటి సోషల్ మీడియా వేదికలలో మిమ్మల్ని గుర్తించే సమాచారాన్ని ఎన్నడూ పంచుకోవద్దు. దానిని మోసగాడు దుర్వినియోగం చేయవచ్చు.
తెలియని వనరుల నుండి వసూలు అభ్యర్థనను మీరు అంగీకరిస్తే, మీ ఖాతా నుండి మీ డబ్బు తీసివేయబడితే, సైబర్ సెల్/బ్యాంక్ కు వెంటనే నివేదించండి.
PhonePe యాప్ లో మోసగాడి నెంబర్ బ్లాక్ చేయండి.
PhonePe యాప్ లో మోసపూరిత సంఘటనలను నివేదించండి. మోసపూరిత లావాదేవీపై క్లిక్ చేయడం ద్వారా “PhonePe సహాయ విభాగాన్ని సంప్రదించండి”ని క్లిక్ చేసి, ఒక టికెట్ ను లేవనెత్తండి.