Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టాటా న్యూ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్ 2 వేరియంట్లలో లభిస్తుంది: టాటా న్యూ ప్లస్ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్ మరియు టాటా న్యూ ఇన్ఫినిటీ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్
ఇది తన వినియోగదారులకు ప్రత్యేక అనుకూలతలను అందిస్తుండగా, టాటా న్యూ మరియు దాని భాగస్వాములతో లావాదేవీలను నిర్వహించే సమయంలో మరిన్ని రివార్డులను అందిస్తుంది.
వినియోగదారులు ఆన్లైన్ మరియు అన్నిఆఫ్లైన్ స్టోర్లలో కొనుగోలు చేసినప్పుడు రివార్డులను అందుకుంటారు.
హైదరాబాద్ : భారతదేశంలో అత్యంత రివార్డింగ్ కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డును అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు టాటా న్యూ మరియు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు తమ భాగస్వామ్యాన్ని ప్రకటించాయి. టాటా న్యూ ప్లస్ హెచ్‌డిఎఫ్‌సి కార్డు మరియు టాటా న్యూ ఇన్ఫినిటీ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ క్రెడిట్ కార్డు పేరిట ఈ కార్డును రెండు వేరియంట్లలో విడుదల చేస్తున్నారు. టాటా న్యూ వినియోగదారులు టాటా న్యూ యాప్ ద్వారా క్రెడిట్ కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చు మరియు సరళమైన మరియు మరింత రివార్డింగ్ అనుభవానికి కార్డు వివరాలను యాప్ ద్వారా పొందవచ్చు. కార్డు రెండు వేరియంట్ల రూపే అలాగే వీసా నెట్వర్కుల్లో లభిస్తాయి.
ఈ కార్డులు రెండూ బ్రాండ్ల సామర్థ్యాలను అలవర్చుకోవడం ద్వారా ఉన్నతమైన విలువలు అలాగే వినియోగదారులకు ఏకీకృతమైన అనుభవాన్ని భారత దేశంలో కార్డులను అందించడంలో అగ్రగామిగా ఉన్న హెచ్‌డిఎఫ్‌సి మరియు టాటా న్యూలోని ఆమ్నిఛానల్ పరిధి ద్వారా అందిస్తాయి. ఈ కార్డును ప్రత్యేకంగా నిలిపేది ఏమిటంటే ఇది వినియోగదారులకు న్యూ కాయిన్స్ (1 న్యూ కాయిన్ = రూ.1) ద్వారా ఆన్లైన్ మరియు స్టోర్లలో చేసే అన్ని కొనుగోళ్లకు రివార్డులను సంపాదించుకునేందుకు సహకరిస్తుంది. వినియోగదారులు టాటా నియోప్లస్ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు క్రెడిట్ కార్డు ద్వారా 2% మేర నియోకాయిన్లు మరియు టాటా న్యూ ఇన్ఫినిటీ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా 5% మేర నియోకాయిన్ల భాగస్వామ్యపు టాటా బ్రాండ్ల ఆన్లైన్ మరియు స్టోర్లలో అన్ని కొనుగోళ్లపై పొందుతారు. భాగస్వామ్య టాటా బ్రాండ్ల దేశీయ మరియు అంతర్జాతీయ కొనుగోళ్లకు వినియోగదారులు ఆయా కార్డు వేరియంట్ల ఆధారంగా 1% మరియు 1.5% పొందుతారు.
ఈ కార్డులు టాటా న్యూ వినియోగదారులకు టాటా న్యూ ద్వారా ప్రతి కొనుగోలుకూ ప్రస్తుత రివార్డులను మరింత ఉత్తేజిస్తుంది. ప్రస్తుతం టాటా న్యూ 5% మేర న్యూ కాయిన్స్‌తో వినియోగదారులు ఇప్పుడు కార్డు వేరియంట్ ఆధారంగా న్యూ యాప్‌లో వారు ఖర్చు చేసిన విలువపై 7% లేదా 10% మేర పొందుతారు.
ఈ భాగస్వామ్యం గురించి టాటా డిజిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సీఈఓ మొదన్ సహా మాట్లాడుతూ, 'భారతదేశంలో అత్యంత పెద్ద ఆర్థిక సంస్థల్లో ఒకటైన హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకుతో మా వినియోగదారులకు నిత్యావసరాలు, ప్రయాణం, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, ఆరోగ్యం మరియు వెల్నెస్లతో పాటు విస్తృత శ్రేణి విభాగాల్లో ఎంపికకు భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. టాటా న్యూ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు క్రెడిట్ కార్డు టాటా న్యూ వినియోగించే భారతీయ వినియోగదారుని జీవితాన్ని సరళీకృతం చేస్తుంది. టాటా అనుభవాన్ని మరింత వృద్ధి చేసే మరియు దేశ వ్యాప్తంగా మా ఉద్దేశిత వినియోగదారులకు ఇష్టమవుతుందన్న నిరీక్షణలో ఉన్నాము` అని తెలిపారు.
హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ పేమెంట్ బిజినెస్, కన్సూమర్ ఫైనాన్స్ టెక్నాలజీ అండ్ డిజిటల్ బ్యాంకింగ్ గ్రూపు హెడ్ పరాగ్ రావు మాట్లాడుతూ, 'భారతదేశపు కార్డులను అందించడంలో అగ్రగామిగా ఉన్న మేము ప్రతి వినియోగదారుని వలయానికి కస్టమైజ్ ఆఫర్ ఇచ్చేందుకే మేము నిరంతరం ప్రయత్నిస్తున్నాము. అందుకే మేము ప్రయాణం, ఆరోగ్య సేవలు, ఫిన్‌టెక్ మరియు రిటెయిల్ రంగాల్లో పలు సంస్థలతో పని చేయడం ద్వారా ఈ వర్గంలో అత్యుత్తమ చెల్లింపు పరిహారాలను అందిస్తున్నాము. టాటా డిజిటల్‌తో కలిసి ఈ ఆకర్షణీయమైన భాగస్వామ్యానికి చాలా సంతోషిస్తున్నాము. దీనితో ఇతర అగ్రగామి బ్రాండ్లను టాటా న్యూ యాప్ పరిధిలోకి తీసుకు వచ్చాము. ఈ శ్రేణి కార్డులు వినియోగదారులకు షాపింగ్ అనుభవాన్ని మరింత వృద్ధి చేయడమే కాకుండా వారికి నిత్యావసరాల నుంచి విమానయానం వరకు అసంఖ్యాత ఉత్పత్తులకు అసాధారణ రివార్డులను తిరిగి పొందేందుకు అవకాశాన్ని కల్పిస్తుంది` అని తెలిపారు.
టాటా న్యూ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ క్రెడిట్ కార్డు వినియోగదారులకు సరళంగానే అయినప్పటికీ శక్తియుతమైన రివార్డు కార్యక్రమం ద్వారా సంతృప్తి ఇచ్చే అంచనాలను నెరవేర్చుతుంది. సంపాదించుకున్న న్యూ కాయిన్లను న్యూ యాప్‌లో ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, ప్రయాణం, ఆతిథ్యం, నిత్యావసరాలు, మరియు ఔషధాలను అన్ని భాగస్వామ్య బ్రాండ్లను (ఆన్లైన్ మరియు ఇన్-స్టోరు)లో కొనుగోలు చేసుకునేందుకు వారికి అనుకూలతను మరియు టాటా న్యూ ఎకోసిస్టమ్‌లో లావాదేవీలను నిర్వహించేందుకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కార్డుదారులు భారతదేశం మరియు విదేశాల్లో విమానాశ్రయాల్లో కాంప్లిమెంటరీగా లాంజ్ సేవలను వినియోగించుకోవచ్చు.