Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : అమ్మకాల ఒత్తిడితో గురువారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ పతనాన్ని చవి చూశాయి. మధ్యాహ్నాం తర్వాత అమ్మకాల వెల్లువతో బీఎస్ఈ సెన్సెక్స్ ఇంట్రాడేలో 709 పాయింట్లు పతనమైంది. ఆ తర్వాత కొంత కోలుకుని తుదకు 311 పాయింట్లు లేదా 0.53 శాతం కోల్పోయి 58,775 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 83 పాయింట్లు తగ్గి 17,522కు పడిపోయింది. దాదాపు అన్ని రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, ఆటో, ఐటీ రంగాలు అధికంగా నష్టపోయాయి. ఇండస్ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ, కోటక్, ఎన్టీపీసీ, ఇన్ఫోసిస్, అదానీ, బజాజ్ ఫిన్సర్వ్, టీసీఎస్, సిప్లా, పవర్ గ్రిడ్ సూచీలు అధికంగా విలువ కోల్పోయిన వాటిలో ముందు వరుసలో ఉన్నాయి.