Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెబీ అనుమతి లేకుండా ఎలా కొంటారు
- స్టాక్ ఎక్సేంజీలకు ఎన్డీటీవీ సమాచారం
న్యూఢిల్లీ : ప్రముఖ మీడియా దిగ్గజం ఎన్డీటీవీలో అదానీకి చెందిన కంపెనీ దొడ్డిదారిన వాటాలు స్వాధీనం చేసుకున్న విధానంపై ఆ చానెల్ మరోసారి ప్రశ్నించింది. ఈ చానెల్ ప్రమోటర్ కంపెనీ ఆర్ఆర్పీఆర్ లిమిటెడ్‌లో ప్రమోటర్ల వాటాలను సొంతం చేసుకునేందుకు ఆదానీ గ్రూపునకు చెందిన విశ్వప్రధాన్ కమర్షియల్ ప్రయివేటు లిమిటెడ్‌కు రెగ్యూలేటరీ సంస్థ సెబీ అనుమతి తప్పనిసరి అని గురువారం ఎన్డీటీవీ స్పష్టం చేసింది. ఈ విషయమై ఆ సంస్థ స్టాక్ ఎక్సేంజీలకు సమాచారం ఇచ్చినట్టు ఓ ప్రకటన విడుదల చేసింది. అదానీకి చెందిన సంస్థ తమ ప్రమోటర్ల వాటాలను స్వాధీనం చేసుకునే ఒప్పందాన్ని రద్దు చేయాలని కోరింది. ఈ ప్రక్రియ ముందుకు జరగకుండా చూడాలని తెలిపింది. ఎన్డీటీవీలో మెజారిటీ వాటాలను చేజిక్కించుకోనున్నట్టు మంగళవారం అదానీ మీడియా నెట్వర్క్స్ లిమిటెడ్ అనుహ్యాంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఆర్ఆర్పీఆర్ హోల్డింగ్‌కు విశ్వప్రదాన్ కమర్షియల్ ప్రయివేటు లిమిటెడ్ (వీసీపీఎల్) రూ.403 కోట్ల రుణం ఇచ్చింది. ఈ రుణం చెల్లించలేకపోతే దీన్ని 29.18 శాతం వాటాకు సమానమయ్యే ఈక్విటీకి మార్చుకోవచ్చని ఒప్పందంలో ఉంది. దీన్ని ఆసరగా తీసుకుని ఎన్డీటీవీని ఎలాగైనా స్వాధీనం చేసుకోవాలనే అదానీ ఎత్తుగడల్లో భాగంగా తొలుత వీసీపీఎల్‌ను కొనుగోలు చేసింది. దీంతో ఎన్డీటీవీలో ఉన్న 29.18 శాతం వాటాలను కొనుగోలు చేశామని.. మరో 26 శాతం వాటా కొనుగోలుకు ఓపన్ ఆఫర్ ఇస్తున్నామని అదానీ తెలిపింది. ''ఈ చర్య పూర్తిగా ఊహించనిది. అసంబద్దమైనది. మా సమ్మతి, చర్చలు లేకుండా అదానీ గ్రూపు ఈ ప్రకటన చేసింది.'' అని ఎన్డీటీవీ పేర్కొంది. న్యూఢిల్లీ టెలివిజన్ లిమిటెడ్ (ఎన్డీటీవీ) వ్యవస్థాపక ప్రమోటర్లయినా ప్రణరు రారు, రాధికా రారుపై సెబీ రెండేళ్ల పాటు నిషేధం విధించిన విషయాన్ని గుర్తు చేసింది. దీంతో వారు ఏ రకమైన సెక్యూరిటీ లావాదేవీలు జరపడానికి అర్హులు కాదని వెల్లడించింది. ప్రణరు రారు, రాధికా రారుపై 2022 నవంబర్ 26 వరకు ఈ నిషేధం అమల్లో ఉంది. అప్పటి వరకు వారు భారతదేశ సెక్యూరిటీల మార్కెట్లో వాటాలను కొనడం లేదా అమ్మడం నుండి నిషేధించబడ్డారు. కాబట్టి అదానీ నియంత్రణ కోసం ప్రయత్నిస్తున్న షేర్లను బదిలీ చేయలేరని ఎన్డీటీవీ స్పష్టం చేసింది.