Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : వారెన్ బఫ్పెట్ మద్దతుగల వాహన తయారీ సంస్థ బీవైడీ భారత్లో మూడు స్టోర్లకు విస్తరించింది. ఈ కొత్త అవుట్లెట్ ను శుక్రవారం హైదరాబాద్లో తెరి చింది. ఈ సందర్బంగా రెండు ఎలక్ట్రిక్ ఎంపీవీలు, ఆల్-న్యూ ఈ6లను మోడీ గ్రూపు మేనేజింగ్ డైరెక్టర్ నిహార్ మోడీ, మోడీ గ్రూపు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పార్థ్ మోడీ వినియోగదారులకు అందజేశారు. ఈ నూతన షోరూంతో తమ వినియోగదారులకు మరింత దగ్గర అవుతున్నామని బివైడి ఇండియా ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వెహికల్ బిజినెస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సంజరు గోపాలకృష్ణన్ పేర్కొన్నారు.