Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పడిపోయిన షేర్ల విలువ
ముంబయి : వాణిజ్య, ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం ఐషర్ మోటార్స్ గ్లోబల్ చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ (సీఎఫ్ఓ) కాలీశ్వరం అరుణా చలం అనూహ్యంగా తన పదవికి రాజీనామా చేశారు. సెప్టెంబర్ 2నుంచి పూర్తిగా బాధ్యతల నుంచి వైదొలగనున్నట్టు తెలిపారు. దీంతో శుక్రవారం నిఫ్టీలో ఆ కంపెనీ షేర్ 3.67 శాతం లేదా రూ.127.75 పతనమై రూ.3,353.70కి పడిపోయింది. అరుణాచలం అతి త్వరలోనే ప్రముఖ ఎలక్ట్రికల్ ఉత్పత్తుల కంపెనీ క్రాంప్టన్లో సీఎఫ్ఓగా చేరనున్నారు. సెప్టెంబర్ 5 నుంచి ఈ కంపెనీలో ఆయన బాధ్యతలను స్వీకరించనున్నారు.