Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్డీటీవీ వాటాల స్వాధీనంపై అదానీ
న్యూఢిల్లీ : ప్రముఖ మీడియా దిగ్గజం ఎన్డీటీవీలోని వాటాల స్వాధీనాన్ని మార్కెట్ రెగ్యూలేటరీ సంస్థ సెబీ అడ్డుకోలేదని అదానీ గ్రూపు పేర్కొంది. ఈ వాటాలను సొంతం చేసుకోవడానికి సెబీ అనుమతులు అవసరం లేదని శుక్రవారం పేర్కొంది. తమ సంస్థలోని వాటాల స్వాధీనానికి సెబీ అనుమతి అవసరమని ఎన్డీటీవీ పేర్కొన్న నేపథ్యంలో అదానీ గ్రూపు ఈ ప్రకటన చేసింది. స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ చేయరాదని ప్రమోటర్లు ప్రణరురారు, రాధికారారులను నిషేధిస్తూ సెబీ జారీ చేసిన ఆదేశాలు వారికి మాత్రమే వర్తిస్తాయని.. సెబీ ఆదేశాల పరిధిలోకి తమ బిడ్ రాదని పేర్కొంది. విసిపిఎల్తో చేసుకున్న ఒప్పందం మేరకు తక్షణం తమకు 29.18 శాతం వాటాలను కేటాయించాలని కోరింది. ''అదానీ చర్యలు ఊహించనిది. అసంబద్దమైనది. మా సమ్మతి, చర్చలు లేకుండా అదానీ గ్రూపు వాటాలను కొనుగోలు చేసింది'' అని ఇది వరకు ఎన్డీటీవీ ప్రకటన చేసిన విషయం తెలిసిందే.