Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఓమ్నీ ఛానెల్ విస్తరణ లక్ష్యం
ఇరవై ఐదేండ్ల వయసున్న బ్రాండ్ రియా , వాటా విలువ పరంగా నెంబర్1 బ్రాండ్‌గా ఇండియాలో వెలుగొందుతుంది. ఇక్కడ బ్రాండ్ వాటా 10.8%గా ఉంది : నీల్సన్ ఐక్యు ఆడిట్ రిపోర్ట్ ; జనవరి–డిసెంబర్ 2021
న్యూఢిల్లీ, ఆగస్టు 27, 2022 : సుప్రసిద్ధ పరిమళ ద్రవ్య బ్రాండ్ రియా, పరిమళ ద్రవ్య పరిశ్రమలో 25 సంవత్సరాల మైలురాయిని పూర్తి చేసుకుంది. 2021-2022 ఆర్ధిక సంవత్సరంలో కొవిడ్ మహమ్మారి ఆధారిత మార్కెట్ సవాళ్లు ఉన్నప్పటికీ 80 కోట్ల రూపాయల టర్నోవర్ సాధించింది.
కోల్‌కతాలో 1997లో ప్రారంభమైన రియా, ఇప్పుడు భారతదేశంలో పరిమళ ద్రవ్య విభాగపు లీడర్‌గా వరుసగా మూడవ సంవత్సరం కూడా విలువ వాటా పరంగా నిలిచిందని అత్యంత ప్రతిష్టాత్మకమైన నీల్సన్ ఐక్యు రిటైల్ ఆడిట్ రిపోర్ట్, జనవరి-డిసెంబర్ 2021 వెల్లడించింది.
భారతదేశంలో పరిమళ ద్రవ్య వ్యాపారం 790 కోట్ల రూపాయలుగా ఉంది. దీనిలో ఈ-కామర్స్ వ్యాపారం మినహాయించబడిందని నీల్సన్ ఐక్యు రిటైల్ ఆడిట్ రిపోర్ట్, జనవరి-డిసెంబర్ 2021 వెల్లడిస్తుంది. ఈ పరిశ్రమ 2025 నాటికి 1200 కోట్ల రూపాయల వ్యాపారంగా మారనుందని అంచనా (ఈ-కామర్స్ కూడా కలుపుకుని)
దేశీయంగా వృద్ధి చెందిన బ్రాండ్, భారతదేశ వ్యాప్తంగా కార్యకలాపాలు నిర్వహిస్తుంది. ఇది వృద్ధి చెందుతున్న పరిమళ ద్రవ్య మార్కెట్లో 2025 నాటికి 20% మార్కెట్ వాటా పొందాలని లక్ష్యంగా పెట్టుకోవడంతో పాటుగా 240 కోట్ల రూపాయల టర్నోవర్ సాధించాలని నిర్ధేశించుకుంది.
'భారతదేశంలో 300 సంవత్సరాల క్రితం నుంచి పరిమళ ద్రవ్య తయారీ, వినియోగం పరంగా అపారమైన నైపుణ్యం కలిగిన చరిత్ర ఉంది. అతి క్లిష్టమైన సుగంద ద్రవ్యాల పట్ల కూడా సామాన్య భారతీయునికి మెరుగైన అవగాహన కలిగి ఉండటంతో పాటుగా అతి శక్తివంతమైన సాంస్కృతిక అంశాలు భారతీయ పరిమళాలకు వినూత్నమైన లక్షణాన్ని అందించాయి. పాశ్చాత్య ఆలోచనలతో కూడిన పరిమళ ద్రవ్యం ఇప్పుడు విలాసం మరియు విదేశాలకు చెందిన అరుదైన సువాసనలతో మరింతగా అభివృద్ధి చెందాయి. దీనితో ప్రధాన స్రవంతి భారతీయ వినియోగదారులకు ఇవి అందుబాటులోకి లేకుండా పోయాయి. అత్యంత శక్తివంతమైన భారతీయ నేపథ్యం, ఈ రంగం పట్ల అపారమైన పరిజ్ఞానంతో రియా ఈ విభాగంలో తనకంటూ ప్రత్యేక స్ధానం సంపాదించుకుంది. అదే సమయంలో టియర్ 1, 2, 3 మార్కెట్లతో పాటుగా మెట్రోపాలిటన్ నగరాలలోనూ వినియోగదారులను అమితంగా ఆకర్షించింది` అని ఆదిత్య విక్రమ్ దాగా, ఫౌండర్ - సీఈవో, పర్పస్ ప్లానెట్ అన్నారు.
'ఇప్పుడు పరిమళ ద్రవ్యాలు ప్రతీ వ్యక్తి జీవితంలో ఓ భాగంగా మారుతున్నాయి. ప్రత్యేక సందర్భాలలో వినియోగం మాత్రమే కాదు వారి ప్రతి రోజూ గ్రూమింగ్ అవసరాలలోనూ భాగమవుతున్నాయి. ఈ రంగం వ్యవస్ధీకృతం కాకపోవడం చేత అసంఘటిత రంగంలోనే ఎక్కువ మంది కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఇది అతి పెద్ద సవాల్‌గా నిలువడంతో పాటుగా టియర్ 2,టియర్ 3 నగరాలలో పరిమళ ద్రవ్య మార్కెట్‌ను ఛిద్రం చేసింది. అసలైన అంతర్జాతీయ బ్రాండ్లు ప్రతి రోజూ వినియోగానికి అత్యంత ఖరీదుగా మారాయి. ఇవి అధిక సంఖ్యలో వినియోగదారులను చేరుకోవడమూ కష్టం. అందువల్ల చాలామంది వాటిని ప్రత్యేక సందర్భాలలో వినియోగించే పరిమళ ద్రవ్యంగా మార్చుకున్నారు. మేము అంతర్జాతీయ బ్రాండ్లు విస్తరించని ఈ ప్రత్యామ్నాయ మార్కెట్ పై దృష్టి సారించాము` అని ఆయన జోడించారు.
పునర్నిర్మాణ ప్రయత్నాలలో 2020లో పర్పస్ ప్లానెట్ను ప్రారంభించారు. దీనిద్వారా బ్రాండ్ రియాను వైవిధ్యీకరించడంతో పాటుగా వృద్ధి చేస్తున్నారు. ఈ బ్రాండ్ ఇప్పుడు విస్తరణ ప్రణాళికలో ఉంది. తమ ఆఫ్‌లైన్ కార్యక్రమాలను నూతన వినియోగదారుల విభాగాలకు సైతం విస్తరించడంతో పాటుగా పలు ఈ-కామర్స్, సామాజిక వాణిజ్య వేదికలకూ విస్తరించనుంది.
'ప్రస్తుతం , రియా విస్తృత శ్రేణిలో పరిమళ ద్రవ్యాలు, డియోడరెంట్లు, రూమ్ ఫ్రెష్నర్స్,ఎయిర్ ఫ్రెష్నర్స్ అందిస్తుంది. కేరళ మినహా భారతదేశ వ్యాప్తంగా మేము కార్యకలాపాలు నిర్వహిస్తున్నాము. ప్రస్తుతం కార్యకలాపాలు నిర్వహిస్తోన్న మార్కెట్లలో మా పంపిణీ మరింతగా విస్తరించడంతో పాటుగా నూతన ప్రాంతాలకు సైతం విస్తరించనున్నాము. ఈ పరిమళ ద్రవ్యాలతో పాటుగా మా మార్కెట్ నాయకత్వంను స్ధిరీకరించుకోవడానికి బ్యూటీ, గ్రూమింగ్, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తి విభాగాలపై సైతం దృష్టి సారించనున్నాము. రియా యొక్క వినూత్నమైన విలువ ప్రతిపాదనతో, మేము సామాజిక మరియు ఈ-కామర్స్ నిర్థిష్టమైన వ్యూహాలకు తుది మెరుగులు అద్దే ప్రయత్నంలో ఉంది` అని దాగా అన్నారు.
ఆసక్తికరంగా, ఈ బ్రాండ్ ఎన్నడూ కూడా మీడియా ప్రకటనల కోసం ఖర్చు చేయలేదు. నమ్మకం, స్ధిరంగా ప్రపంచ శ్రేణి నాణ్యత కలిగిన పెర్ఫ్యూమ్స్ అందించగా ఈ బ్రాండ్‌కు అద్భుతాలను సాధించి పెట్టాయి.