Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ గోవా: హింద్‌వేర్ లిమిటెడ్‌కు చెందిన సుప్రసిద్ధ లగ్జరీ బాత్రూమ్ బ్రాండ్ క్యుయో నేడు నూతన లగ్జరీ ఫాసెట్లు, శానిటరీ వేర్ కలెక్షన్ విడుదల చేసింది. ఈ నూతన శ్రేణిలో ఫోర్జా పేరిట పూర్తి శ్రేణి ప్రిస్టిన్ ఫాసెట్స్ కూడా ఉంటాయి. విలాసవంతమైన శానిటరీ పోర్ట్‌ఫోలియోలో ట్యాంక్‌లెస్ ఈడబ్ల్యుసీ, ఒన్ పీస్ వాటర్ క్లోసెట్స్, వాల్ మౌంటెడ్ ఈడబ్ల్యుసీ, ఓవర్ ద కౌంటర్ బేసిన్ కూడా ఉంటాయి. ఈ ఆవిష్కరణతో లగ్జరీ బాత్ వేర్ విభాగంలో తమ ఆఫరింగ్స్‌ను విస్తరించడాన్ని కంపెనీ లక్ష్యంగా చేసుకుంది.
హింద్‌వేర్ లిమిటెడ్ బాత్ అండ్ టైల్స్ డివిజన్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సుధాంశు పొఖ్రియాల్ మాట్లాడుతూ ‘‘ శానిటరీవేర్ మరియు ఫాసెట్స్ విభాగంలో అగ్రగామిగా మేమెప్పుడూ కూడా నూతన ధోరణులు, అనుభవాలను తీసుకురావడంలో ముందుంటాము. నేటి ఆవిష్కరణలో సైతం అది ప్రతిబింబిస్తుంది. వినియోగదారులు ఇప్పుడు యూరోపియన్ బాత్ లాంజ్‌ల విలాసాన్ని క్యుయోతో తమ ఇంటి వద్దనే ఆస్వాదించవచ్చు. హింద్‌వేర్ లిమిటెడ్‌కు చెందిన ప్రీమియం బ్రాండ్ క్యుయో. ఈ మాస్టర్ పీస్‌లు ఒకరి భారీ వ్యక్తిత్వంకు కొనసాగింపుగా ఉండటంతో పాటుగా ఇతరులు సైతం వీరిని అనుసరించేలా స్టైల్ స్టేట్మెంట్ను అందిస్తుంది. మా తాజా ఆఫరింగ్‌ను తమ బాత్ స్పేస్‌లో ఆహ్లాదకరమైన, సౌందర్యవంతమైన డిజైన్లను కోరుకునే వినియోగదారులు అభినందించగలరు’’ అని అన్నారు. ఆర్ధిక సంవత్సరం 2022 లో కంపెనీ ఆదాయం 1795 కోట్ల రూపాయలుగా ఉండటంతో పాటుగా 42% వృద్ధి నమోదుచేసింది. నూతన శిఖరాలను కంపెనీ అధిరోహిస్తోన్న వేళ వినియోగదారులతో తమ బంధం బలోపేతం చేయాలనుకుంటుంది. క్యుయోకు 85 స్టోర్లు దేశవ్యాప్తంగా ఉన్నాయి.