Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ హైదరాబాద్ : యునియన్ రిటైర్మెంట్ ఫండ్‌ను విడుదల చేసినట్లు యునియన్ ఏఎంసీ ప్రకటించింది. ఇది ఓపెన్ ఎండెడ్ రిటైర్మెంట్ సొల్యూషన్ ఓరియెంటెడ్ స్కీమ్. ఇది ఐదు సంవత్సరాలు లేదంటే రిటైర్మెంట్ వయసు వరకూ (ఏది ముందు అయితే అది) లాక్–ఇన్ చేయబడుతుంది.
ఈ నూతన ఫండ్ ఆఫర్ (ఎన్ఎఫ్ఓ)ను 01 సెప్టెంబర్ 2022న తెరువడంతో పాటుగా 15 సెప్టెంబర్ 2022 న మూసివేస్తారు. కనీసం 1000 రూపాయలు ఆ పైన ఎంతైనా పెట్టుబడి పెట్టవచ్చు.
యునియన్ రిటైర్మెంట్ ఫండ్ పలు పరిశ్రమల వ్యాప్తంగా ఉద్యోగులు వదిలి వేస్తోన్న సమయంలో విడుదల చేశారు. చాలామంది పరిశ్రమలు మారడం లేదంటే, పూర్తిగా ఉద్యోగాలు వదిలివేయడం, తాత్కాలిక ఉద్యోగాలు కోసం చూడటం జరుగుతుంది. ఈ ధోరణితో పాటుగా సగటు ఆయుర్ధాయం పెరిగిన తరువాత ప్రతి ఒక్కరూ తమ రిటైర్మెంట్ జీవితాన్ని చక్కగా ప్రణాళిక చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఈ స్కీమ్‌ను పూర్తి క్రమశిక్షణతో తమ లక్ష్యాలను చేరుకునేందుకు తోడ్పడేలా తీర్చిదిద్దారు. యునియన్ ఏఎంసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) జి.ప్రదీప్‌కుమార్ మాట్లాడుతూ ‘‘ యునియన్ రిటైర్మెంట్ ఫండ్ కేవలం ఓ ఎన్ఎఫ్ఓ కాదు. ఫైనాన్షియల్ ప్లానింగ్‌తో కోరికలను తీర్చుకోవడానికి వాటాదారుల మధ్య ఆత్మపరిశీలనకు పిలుపునిచ్చే బగల్ ఇది’’ అని అన్నారు. ఈ ఎన్ఎఫ్ఓ కేటాయింపు తేదీ 22 సెప్టెంబర్ 2022. ఈ స్కీమ్‌ను అమ్మకాలు మరియు పునః కనుగొళ్ల కోసం 29 సెప్టెంబర్ 2022న తిరిగి తెరుస్తారు. ఈ స్కీమ్‌ను ఎస్ అండ్ పీ బీఎస్ఈ 500ఇండెక్స్‌కు బెంచ్‌మార్క్ చేశారు. దీనిని వినయ్ పహారియా, సంజయ్ బెంబాల్కర్ నిర్వహించనున్నారు.