Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూపాయి మళ్లీ దిగాలు..
ముంబయి : అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో దలాల్ స్ట్రీట్ దారుణంగా పతనమయ్యింది. గురువారం ఉదయం నుంచి ముగింపు వరకు అమ్మకాల ఒత్తిడి కొనసాగింది. అధిక ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడానికి మరోసారి వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉందన్న అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్మెన్ జెరోమ్ పావెల్ ప్రకటన వర్థమాన దేశాల మార్కెట్లను తీవ్ర ఒత్తిడికి గురి చేసింది. ఈ నేపథ్యంలోనే బీఎస్ఈ సెన్సెక్స్ 861 పాయింట్లు లేదా 1.46 శాతం పతనమై 57,973కు పడిపోయింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 246 పాయింట్లు కోల్పోయి 17,312 వద్ద ముగిసింది. బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు 0.8 శాత ం చొప్పున నష్టపోయాయి. రంగాల్లో ఒక్క ఎఫ్ఎంసీజీ మాత్రమే 0.3 శాతం పెరగ్గా.. మిగితా రంగాలన్నీ ప్రతికూలతను ఎదుర్కొన్నాయి. స్టాక్ మార్కెట్ల పతనం, ఎఫ్ఐఐలు తరలిపోవడంతో రూపాయి విలు వపై ఒత్తిడి పెరిగింది. సోమవారం అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్లో డాలర్‌తో రూపాయి మారకం విలువ 10 పైసలు కోల్పో యి 79.94కు పడిపోయింది. ఇంట్రాడేలో ఏకంగా 80.15కి క్షీణించింది. ఇంతక్రితం జులై 20న తొలిసారి రూపాయి విలువ రికార్డ్ స్థాయిలో 80.05కు పతనమయ్యింది.