Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : భారతదేశంలో అతిపెద్ద ప్రైవేట్ ఇంధన రంగ సంస్థలలో ఒకటైన ఏజీ & పీ సిటీ గ్యాస్; ఏజీ & పీ ప్రథమ్ బ్రాండ్ పేరిట తమ కార్యకలాపాలను నిర్వహిస్తుంది. ఏజీ & పీ నేడు తమ 201వ కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్జీ) స్టేషన్ మరియు 4వ ఎల్‌సీఎన్‌జీ స్టేషన్‌ను మైసూర్‌లోని హెబ్బల్ వద్ద ప్రారంభించింది. ఏజీ & పీ ప్రథమ్ గత ఏడు నెలల కాలంలో దాదాపు 150 సీఎన్జీ స్టేషన్లను అభివృద్ధి చేసింది. తద్వారా ప్రతి వారం దాదాపు ఐదు సీఎన్జీ స్టేషన్లను ప్రారంభించినట్లయింది. గౌరవనీయ కేంద్ర పెట్రోలియం , సహజవాయు మరియు గృహ మరియు నగర వ్యవహారాల శాఖామాత్యులు శ్రీ హర్దీప్ సింగ్ పురి ఈ సీఎన్జీ, ఎల్‌సీఎన్‌జీ స్టేషన్లను ఆన్లైన్ వేడుకల ద్వారా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పెట్రోలియం మరియు సహజవాయు మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ పంకజ్ జైన్ తో పాటుగా మంత్రిత్వ శాఖకు చెందిన ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఏజీ & పీ ప్రథమ్‌కు 12 భౌగోళిక ప్రాంతాలలో 34 జిల్లాల వ్యాప్తంగా సీజీడీ నెట్‌వర్క్స్‌ను అభివృద్ధి చేసేందుకు అనుమతించారు. దీనిద్వారా భారతదేశ వ్యాప్తంగా 8%ను మరియు 64 మిలియన్ల మంది ప్రజలను రాజస్తాన్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్నాటక మరియు కేరళలలో చేరుకోనుంది. దీనియొక్క పన్నెండు భౌగోళిక ప్రాంతాలలో, ఏజీ & పీ ప్రథమ్ వాహనాల కోసం సీఎన్జీ స్టేషన్లను అభివృద్ధి చేయడం మరియు నిర్వహించడం చేయనుంది. దీనితో పాటుగా ఇళ్లకు పైప్‌లతో సహజవాయవు సరఫరా, పారిశ్రామిక, కమర్షియల్ సంస్థలకు గ్యాస్ సరఫరా కూడా చేస్తుంది. ఏజీ & పీ ప్రథమ్ ఇటీవలనే ‘ఇండియా 2022 ఎనర్జీ కంపెనీ ఆఫ్ ద ఇయర్ అవార్డును ఎకనమిక్ టైమ్స ఎనర్జీ లీడర్షిప్’ అవార్డుల వద్ద గెలుచుకుంది. వర్ట్యువల్‌గా ఏజీ & పీ ప్రథమ్ యొక్క 201వ సీఎన్జీ స్టేషన్ ప్రారంభించిన అనంతరం కేంద్ర పెట్రోలియం, సహజవాయు మరియు గృహ, నగరవ్యవహారాల శాఖామాత్యులు శ్రీ హర్దీప్ సింగ్ పురి మాట్లాడుతూ దేశంలో సీఎన్జీ మరియు ఎల్‌సీఎన్‌జీ స్టేషన్లను విస్తరించడం పట్ల ఏజీ & పీ ప్రథమ్‌ను అభినందిస్తున్నానన్నారు. ఆయన మాట్లాడుతూ భారీ స్ధాయిలో ప్రజలకు స్వచ్ఛమైన మరియు స్ధిరమైన ఇంధనాలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు తగిన మద్దతును అందించడంతో పాటుగా తగిన విధాన మరియు నియంత్రణ వాతావరణం సైతం మెరుగుపరుస్తున్నామన్నారు. గత ఎనిమిది సంవత్సరాలుగా, సీఎన్జీ దేశంలో సీఎన్జీ స్టేషన్లు 2014లో 938 ఉంటే, అవి 4629కు చేరాయి. ఈ సంఖ్య 8000కు చేరవచ్చు. పీఎన్జీ కనెక్షన్స్ నాలుగు రెట్లు పెరిగి దాదాపు ఒక కోటి కనెక్షన్స్‌కు చేరాయి. అదే సమయంలో సీజీడీ నెట్వర్క్ 9 రెట్లు పెరిగి 630 జిల్లాలను కవర్ చేస్తుందన్నారు. మంత్రి వర్యులు మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం రాజకీయ అంశాల పట్ల స్పష్టతతో ఉంది మరియు నిర్ణయాలను అమలు చేసే సామర్ధ్యం కూడా కలిగి ఉంది. ఈ కారణంగానే ఈ లక్ష్యాలను చేరుకోగలిగామన్నారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వమంటే వ్యాపారం, విద్యుత్ రంగంలో గ్యాస్ వినియోగం 15% వరకూ పెరిగింది మరియు సీజీడీ నెట్వర్క్ దాదాపు 90% వినియోగదారులకు చేరువవుతుందన్నారు. శ్రీ పురి మాట్లాడుతూ ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితులలో గ్యాస్ ఉత్పత్తి, లభ్యత మరియు క్రూడ్ లభ్యత ఓ సవాల్‌గా మారింది. కానీ ఇండియాలో మాత్రం ఇంధన భద్రత ఉంది. దీనితో పాటుగా అది అందుబాటుధరలలో లభ్యమవుతుంది. దేశీయంగా గ్యాస్ ధరలు స్వల్పమొత్తంలో హెన్రీ హబ్ మరియు ఇతర ప్రాంతాలలో పెరిగాయన్నారు. ప్రభుత్వం తీసుకున్న పలు చర్యల కారణంగా దేశీయ వినియోగదారులపై పెద్దగా భారం పడలేదన్నారు. గౌరవనీయ ప్రధానమంత్రి ప్రధానమైన ఇంధన రంగంలో సహజవాయువు వినియోగం పెంచాలని లక్ష్యంగా నిర్ధేశించారు.గ్యాస్ ఆధారిత ఆర్థిక వ్యవస్థలో ఈ వాటా 15%గా ఉండాలని ఆయన ఆకాంక్షిస్తున్నారు. గ్యాస్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ 2070 నాటికి భారతదేశం నెట్ జీరో లక్ష్యం చేరుకోవడంలో అత్యంత కీలకమైన పాత్ర పోషించనుంది. ఏజీ & పీ మేనేజింగ్ డైరెక్టర్ , సీఈఓ శ్రీ అభిలాష్ గుప్తా మాట్లాడుతూ ‘‘ మా 201వ సీఎన్జీ స్టేషన్ ప్రారంభించడం మాకు అత్యంత ప్రతిష్టాత్మకమైన మైలురాయిగా నిలుస్తుంది. గత ఏడు నెలల కాలంలో మేము 150 సీఎన్జీ స్టేషన్లను ప్రారంభించాము. అదే రీతిలో గృహ కనెక్షన్లు అందించడం పై కూడా దృష్టి సారించాము. ఇప్పటికే డొమెస్టిక్ పైప్డ్ నేచురల్ గ్యాస్ (డీపీఎన్జీ) మౌలిక సదుపాయాలను 62వేల గృహాలకు అందించాము. 2023 ఆర్ధిక సంవత్సరంలోనే మేము డీపీఎన్జీ మౌలిక సదుపాయాలను 3.36 లక్షల ఇళ్లకు అందించాము. మా లక్ష్యం 1500 సీఎన్జీ కేంద్రాలను ఏర్పాటుచేయడంతో పాటుగా 17వేల కిలోమీటర్ల స్టీల్ పైప్లైన్వేయడం ద్వారా 2.5 మిలియన్ గృహాలను రాబోయే సంవత్సరాలలో అనుసంధానించనున్నాము. సహజవాయు ఆధారిత ఆర్థిక వ్యవస్థలో సహజవాయువును ప్రధానమైన ఇంధన వనరుగా అందించడంపై మేము కృషి చేస్తున్నాము’’అని అన్నారు. ఏజీ & పీ ప్రథమ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఈ దిగువ జిల్లాల్లో సీఎన్జీ స్టేషన్లను నిర్వహిస్తుంది :
చిత్తూరు
చిత్తూరు జిల్లాలో కంపెనీ నాలుగు సీఎన్జీ స్టేషన్లను నిర్వహిస్తుంది. వీటిలో మూడు తిరుపతి నగరంలో ఉంటే, ఒకటి శ్రీ కాళ హస్తిలో ఉంది. మరో 11 సీఎన్జీ స్టేషన్లను కంపెనీ లక్ష్యంలో భాగంగా 2023 ఈ జిల్లాలో ప్రారంభించనుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కంపెనీ వ్యాపార విస్తరణ వ్యూహంలో భాగంగా ఏజీ & పీ ప్రథమ్ ఇప్పుడు గృహ పీఎన్జీ కనెక్షన్స్ కోసం రిజిస్ట్రేషన్లను ప్రారంభించింది. ఇప్పటికే సుమారు 4000 రిజిస్ట్రేషన్లు మరియు 1300 ప్లంబింగ్ కనెక్షన్స్ జరిగాయి. ఈ కంపెనీ 22వేల గృహ పీఎన్జీ కనెక్షన్స్‌ను చిత్తూరు జిల్లాలో మార్చి 2023 నాటికి చేరుకోవడం ద్వారా ఈ జిల్లాలో సహజవాయువుకు సరఫరా–డిమాండ్ అంతరాన్ని పూరించడం లక్ష్యంగా చేసుకుంది.
అనంతపూర్ మరియు కడప జీఏ
ఈ కంపెనీకి అనంతపూర్‌లో 08 సీఎన్జీ స్టేషన్లు మరియు కడపలో 06 సీఎన్జీ స్టేషన్లు ఉన్నాయి. ఈ కంపెనీ అనంతపూర్‌లో మరో 03 మరియు కడపలో మరో 05 స్టేషన్లను 2023 ఆర్ధిక సంవత్సరం కోసం కంపెనీ ప్రణాళికలో భాగంగా విస్తరించనుంది. తమ వ్యాపార విస్తరణ వ్యూహంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏజీ & పీ ప్రథమ్ ఇప్పుడు గృహ పీఎన్జీ కనెక్షన్స్ కోసం రిజిస్ట్రేషన్లను ప్రారంభించింది. ఇప్పటికే అనంతపూర్ నుంచి 8596 రిజిస్ట్రేషన్లు మరియు కడప నుంచి 7278 రిజిస్ట్రేషన్లు జరిగాయి.
నెల్లూరు జీఏ
ఈ కంపెనీకి నెల్లూరు జిల్లాలో ఏడు నిర్వహణలోని సీఎన్జీ స్టేషన్లు ఉన్నాయి. నెల్లూరు నగరంలో 2, మరియు జిల్లాలో 10 స్టేషన్లను 2023 ఆర్థిక సంవత్సరంలో ఏర్పాటుచేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. తమ వ్యాపార విస్తరణ వ్యూహంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏజీ & పీ ప్రథమ్ ఇప్పుడు గృహ పీఎన్జీ కనెక్షన్స్ కోసం రిజిస్ట్రేషన్లను ప్రారంభించింది. ఇప్పటికే సుమారు 6000 రిజిస్ట్రేషన్లు మరియు 1000 కు పైగా ప్లంబింగ్ కనెక్షన్స్ జరిగాయి. ఈ కంపెనీ 20వేల గృహ పీఎన్జీ కనెక్షన్స్‌ను నెల్లూరు జిల్లాలో మార్చి 2023 నాటికి చేరుకోవడం ద్వారా ఈ జిల్లాలో సహజవాయువుకు సరఫరా–డిమాండ్ అంతరాన్ని పూరించడం లక్ష్యంగా చేసుకుంది.