Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : భారతదేశంలో అతిపెద్ద ప్రైవేట్ ఇంధన రంగ సంస్థలలో ఒకటైన ఏజీ & పీ సిటీ గ్యాస్; ఏజీ & పీ ప్రథమ్ బ్రాండ్ పేరిట తమ కార్యకలాపాలను నిర్వహిస్తుంది. ఏజీ & పీ నేడు తమ 201వ కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్జీ) స్టేషన్ మరియు 4వ ఎల్‌సీఎన్‌జీ స్టేషన్‌ను మైసూర్‌లోని హెబ్బల్ వద్ద ప్రారంభించింది. గౌరవనీయ కేంద్ర పెట్రోలియం , సహజవాయు మరియు గృహ మరియు నగర వ్యవహారాల శాఖామాత్యులు శ్రీ హర్దీప్ సింగ్ పురి ఈ సీఎన్జీ, ఎల్‌సీఎన్‌జీ స్టేషన్లను ఆన్లైన్ వేడుకల ద్వారా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పెట్రోలియం మరియు సహజవాయు మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ పంకజ్ జైన్ తో పాటుగా మంత్రిత్వ శాఖకు చెందిన ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
వర్ట్యువల్‌గా ఏజీ & పీ ప్రథమ్ యొక్క 201వ సీఎన్జీ స్టేషన్ ప్రారంభించిన అనంతరం కేంద్ర పెట్రోలియం, సహజవాయు మరియు గృహ, నగరవ్యవహారాల శాఖామాత్యులు శ్రీ హర్దీప్ సింగ్ పురి మాట్లాడుతూ దేశంలో సీఎన్జీ మరియు ఎల్‌సీఎన్‌జీ స్టేషన్లను విస్తరించడం పట్ల ఏజీ & పీ ప్రథమ్‌ను అభినందిస్తున్నానన్నారు. ఆయన మాట్లాడుతూ భారీ స్ధాయిలో ప్రజలకు స్వచ్ఛమైన మరియు స్ధిరమైన ఇంధనాలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు తగిన మద్దతును అందించడంతో పాటుగా తగిన విధాన మరియు నియంత్రణ వాతావరణం సైతం మెరుగుపరుస్తున్నామన్నారు. ఏజీ & పీ మేనేజింగ్ డైరెక్టర్ , సీఈఓ శ్రీ అభిలాష్ గుప్తా మాట్లాడుతూ గత ఏడు నెలల కాలంలో తాము 150 సీఎన్జీ స్టేషన్లను ప్రారంభించామన్నారు. ఇప్పటికే డొమెస్టిక్ పైప్డ్ నేచురల్ గ్యాస్ (డీపీఎన్జీ) మౌలిక సదుపాయాలను 62వేల గృహాలకు అందించామన్నారు. ఈ సందర్భంలోనే ఆయన మాట్లాడుతూ ఈ కంపెనీకి అనంతపూర్‌లో 08 సీఎన్జీ స్టేషన్లు మరియు కడపలో 06 సీఎన్జీ స్టేషన్లు ఉన్నాయి. ఈ కంపెనీ అనంతపూర్‌లో మరో 03 మరియు కడపలో మరో 05 స్టేషన్లను 2023 ఆర్ధిక సంవత్సరం కోసం కంపెనీ ప్రణాళికలో భాగంగా విస్తరించనుంది. తమ వ్యాపార విస్తరణ వ్యూహంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏజీ & పీ ప్రథమ్ ఇప్పుడు గృహ పీఎన్జీ కనెక్షన్స్ కోసం రిజిస్ట్రేషన్లను ప్రారంభించింది. ఇప్పటికే అనంతపూర్ నుంచి 8596 రిజిస్ట్రేషన్లు మరియు కడప నుంచి 7278 రిజిస్ట్రేషన్లు జరిగాయన్నారు.