Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : భారతదేశంలో తమకు బ్రాండ్ అంబాసిడర్లుగా లక్ష్య సేన్, కిడాంబి శ్రీకాంత్, సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి మరియు చిరాగ్ శెట్టిలు వ్యవహరించనున్నారని మాస్టర్ కార్డ్ నేడు ప్రకటించింది. ప్రతిష్టాత్మకమైన థామస్ కప్ 2022 మరియు బర్మింగ్‌హామ్ 2022 కామన్వెల్త్ గేమ్స్ విజేతలైన వీరు, నూతన ప్రచారకర్తలుగా భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల భద్రత, సురక్షత మరియు సౌలభ్యాలకు సంబంధించి అవగాహన కల్పించేందుకు మాస్టర్ కార్డ్‌తో భాగస్వామ్యాన్ని కలిగి ఉంటారు. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ప్రయత్నాలకు అనుగుణంగా మరియు డిజిటల్ ఇండియాపై ప్రధాని మోదీ దృష్టికి అనుగుణంగా ఈ భాగస్వామ్యం ఉంది. ఇటీవలి సంవత్సరాల్లో, భారతదేశంలో వైవిధ్యమైన క్రీడా సంస్కృతి వృద్ధి చెందుతోంది మరియు భారతదేశంలో క్రీడా పరిశ్రమ పరిణామ క్రమంతో పాటు బ్యాడ్మింటన్‌లోకి మాస్టర్‌కార్డ్ అడుగుపెట్టింది. ఈ ఏడాది ప్రారంభంలో, ప్రముఖ గోల్ఫ్ క్రీడాకారుల ప్యానెల్‌ను మరింత మెరుగుపరచేందుకు మాస్టర్కార్డ్శివ్ కపూర్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకోగా, ఇందులో అనిర్బన్ లాహిరి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా, టెన్నిస్ నుంచి క్రికెట్ వరకు, సాకర్ నుంచి ఇ-స్పోర్ట్స్ వరకు, ప్రస్తుతం ఈ జాబితాలో బ్యాడ్మింటన్‌తో పాటు క్రీడలలో విస్తృతమైన పెట్టుబడులను మాస్టర్ కార్డ్ పెట్టింది. నేటి బ్యాడ్మింటన్ అంబాసిడర్లు నూతనోత్సాహాన్ని కలిగిన భారతదేశపు ఆకాంక్షలను ప్రతిబింబించడంతో పాటు యువ తరాలకు గౌరవనీయమైన రోల్ మోడల్‌లుగా వ్యవహరిస్తారు. మాస్టర్ కార్డ్ బ్రాండ్ అంబాసిడర్గాఎం.ఎస్.ధోని పోషించిన కీలక పాత్ర మాదిరిగా, డిజిటల్ చెల్లింపుల భద్రత, సురక్షత మరియు సౌలభ్యాలకు సంబంధించి అవగాహన కల్పించేందుకు వ్యాపారులు మరియు కార్డ్ హోల్డర్లతో కలిసి పనిచేసే మాస్టర్‌కార్డ్ టీమ్ క్యాష్‌లెస్ ఇండియా ప్రచారంలో బ్యాడ్మింటన్ స్టార్లు కూడా భాగం అవుతారు. మాస్టర్‌కార్డ్ దక్షిణాసియా డివిజన్ అధ్యక్షుడు నిఖిల్ సాహ్ని మాట్లాడుతూ, “భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల సౌలభ్యం మరియు సురక్షతకు సంబంధించి అవగాహన కల్పించేందుకు మాస్టర్‌కార్డ్‌కు అత్యంత ప్రాధాన్యత అంశంగా భావిస్తోంది. దేశంలోని లక్షలాది మంది క్రీడా ఔత్సాహికులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న భారత బ్యాడ్మింటన్ స్టార్లు లక్ష్య సేన్, కిడాంబి శ్రీకాంత్, సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి మరియు చిరాగ్ శెట్టిలతో భాగస్వామ్యం కలిగి ఉండడం పట్ల మాస్టర్‌కార్డ్ సంతోషంగా ఉంది. నూతన బ్యాడ్మింటన్ బ్రాండ్ అంబాసిడర్ల మద్ధతుతో, మాస్టర్ కార్డ్ లక్షలాది మంది మంది కార్డ్ హోల్డర్లతో అర్థవంతంగా మమేకం కావడం మరియు భారతదేశం నగదు నుంచి డిజిటల్ ప్రయాణానికి మద్ధతు ఇవ్వడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది’’ అని వివరించారు. లక్ష్య సేన్ మాట్లాడుతూ, “ఉత్తరాఖండ్‌లోని అల్మోరాలో పుట్టి పెరగడం నుంచి, భారతదేశాన్ని బ్యాడ్మింటన్‌లో ప్రపంచ వేదికపై నిలబెట్టడం వరకు నా సాధనల పట్ల నేను వినయపూర్వకంగా, కృతజ్ఞతతో ఉన్నాను. నేను ప్రత్యక్షంగా అనుభవించిన డిజిటల్ చెల్లింపుల ప్రయోజనాలు, సౌలభ్యం మరియు భద్రతను స్పష్టంగా ప్రదర్శించేందుకు మాస్టర్‌కార్డ్‌తో భాగస్వామ్యాన్ని కలిగి ఉండడం ద్వారా లక్షలాది మంది భారతీయులకు స్ఫూర్తిదాయకంగా పనిచేయడం నాకు గౌరవంగా ఉంది’’ అని పేర్కొన్నారు. డిజిటల్ ఇండియా దిశగా ప్రభుత్వ ప్రయత్నాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మాస్టర్ కార్డ్ సహకారాన్ని అందిస్తోంది మరియు చిన్న, మధ్యతరహా పరిశ్రమల (MSME)కోసం డిజిటల్ చెల్లింపులపై వర్క్‌షాప్‌లు, అవగాహన కోసం వీధి నాటకాలు, కర్ణాటక మరియు తమిళనాడులోని రైతుల కోసం అవగాహన సదస్సులు మరియు టీమ్ క్యాష్‌లెస్ ఇండియా వ్యాపారుల డిజిటలైజేషన్‌ను పెంచడం తదితర అనేక కార్యక్రమాలను చేపట్టింది.