Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రు. 19,000 ల నుండి ప్రారంభమయ్యే ధరతో, ఈ లైనప్ శామ్సంగ్ యొక్క అధికారిక ఆన్లైన్ స్టోర్ అయిన శామ్సంగ్ షాప్, అన్ని శామ్సంగ్ రిటైల్ స్టోరులు, అగ్రగామి వినియోగదారు ఎలక్ట్రానిక్ స్టోరులు, అమెజాన్ మరియు ఫ్లిప్‌కార్ట్ తో సహా ఆన్లైన్ వేదికల వ్యాప్తంగా లభిస్తుంది
గురుగ్రామ్ : ఇండియా యొక్క అగ్రగామి మరియు అత్యంత విశ్వసనీయమైన వినియోగదారు ఎలక్ట్రానిక్స్ బ్రాండు అయిన శామ్సంగ్, దుస్తుల వాషింగ్ని మరింత సమర్థవంతంగా చేస్తూ, ఆధునిక జీవనశైలి లాండ్రీ అవసరాలకు ప్రోత్సాహమివ్వడానికి గాను తన పూర్తిగా ఆటోమేటిక్ టాప్ లోడ్ వాషింగ్ మెషీన్ల శ్రేణి అయిన ఈకోబబుల్TM శ్రేణిని విడుదల చేసింది. ఈ ఈకోబబుల్™ మరియు డిజిటల్ ఇన్వర్టర్ టెక్నాలజీతో, ఈ శ్రేణి ప్రతి ఉతుకులోనూ విద్యుత్తును ఆదా చేసుకుంటూ 20% మెరుగైన వస్త్ర రక్షణను చూసుకోవడానికై రూపొందించబడింది.
ఈకోబబుల్™ అనేది, సర్వశ్రేష్టమైన వాష్ నాణ్యతను అందించడానికి గాను శామ్సంగ్ యొక్క బబుల్స్టార్మ్™ మరియు డ్యుయల్స్టార్మ్™ టెక్నాలజీల కచ్చితమైన సమ్మేళనముగా ఉంది. 2.5x వేగవంతమైన డిటర్జెంట్ కలిపివేతతో సమృద్ధమైన బుడగల్ని సృష్టించడానికి గాను బబుల్స్టార్మ్™ గాలి మరియు నీటితో డిటర్జెంటుని మిశ్రమం చేయగా, డ్యుయల్స్టార్మ్™ పల్సేటర్, సమర్థవంతమైన శుభ్రత కోసం డ్రమ్ము లోపల బలమైన నీటి ప్రవాహమును సృష్టించుకుంటుంది.
అంతర్నిర్మితమైన హీటరుతో, పరిశుభ్రమైన ఆవిరితో ఈ కొత్త శ్రేణి, వస్త్రాల నుండి 99.9% వరకూ సూక్ష్మజీవుల్ని నిర్మూలించడానికి గాను 60°C వద్ద దుస్తులను వాష్ చేస్తుంది. అంతమాత్రమే కాదు, సమయం తీసుకునే ముందస్తు శుద్ధి ఏదీ అవసరం లేకుండానే దుస్తుల నుండి మొండి మరకలు మరియు జిడ్డు మరకల్ని తొలగించడంలో ఇది సమర్థవంతమైనది. లాండ్రీ పనులను తక్కువ శ్రమ కలిగించేవిగా చేయడానికి రూపకల్పన చేయబడిన ఈ సూపర్స్పీడ్TM టెక్నాలజీ, లాండ్రీ సమయాన్ని 40% తగ్గిస్తూ ప్రతి లోడునూ కేవలం సుమారు 29 నిముషాల లోపున వాష్ చేస్తుంది.
శామ్సంగ్ ఇండియా, కన్స్యూమర్ ఎలక్ఱానిక్ బిజినెస్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మోహన్‌దీప్ సింగ్ మాట్లాడుతూ “శామ్సంగ్ వద్ద, అనుసంధానిత జీవన అనుభవాన్ని ఇవ్వడం ద్వారా వాడుకదారులకు విలువను జోడించే సృజనాత్మకమైన ఉత్పత్తులను పరిచయం చేయడంపై మేము దృష్టి సారిస్తున్నాము. సూక్ష్మజీవి-వ్యతిరేకమైన, విద్యుత్తు సమర్థవంతమైన, మరియు భారీ కెపాసిటీతో కూడిన వాషింగ్ మెషీన్ల పట్ల పెరుగుతున్న వినియోగదారు గిరాకీని తీర్చడానికి ఈ కొత్త ఈకోబబుల్TM శ్రేణి రూపొందించబడింది. అనేక రకాల పరిశ్రమ-అత్యుత్తమమైన ఫీచర్లతో ఈ కొత్త శ్రేణి, వినియోగదారుల అవసరాలను ప్రస్తావిస్తుందని మేము గట్టి నమ్మకంతో ఉన్నాము,” అన్నారు.
ఈ కొత్త శ్రేణి ఈకోబబుల్TM పూర్తి ఆటోమేటిక్ టాప్ లోడ్ వాషింగ్ మెషీన్లను Wi-Fi ఉపయోగించి మెషీన్ ని శామ్సంగ్ స్మార్ట్‌థింగ్స్ యాప్ కి కనెక్ట్ చేయడం ద్వారా ఏ సమయంలోనైనా, ఎక్కడినుండైనా పర్యవేక్షించవచ్చు, నియంత్రించవచ్చు. ఇది, అనుకూలమైన వాష్ విడతను ఎంపిక చేసుకోవడానికి గాను లాండ్రీ రిసైప్, లాండ్రీని షెడ్యూల్ చేయడానికి గాను లాండ్రీ ప్లానర్, ఎనర్జీ పర్యవేక్షణ, ఇబ్బందులను సరిచేసుకోవడానికి గాను హోమ్ కేర్ విజార్డ్ వంటి ఫీచర్లతో వస్తుంది. ఇండియా కోసం ప్రత్యేకంగా రూపకల్పన చేయబడిన ‘చీర’ విడతతో సహా స్మార్ట్‌థింగ్స్ యాప్ అదనపు వాష్ ప్రోగ్రాములను అందిస్తుంది.
కొత్త లైనప్ ఒక విశిష్టమైన స్పేస్మ్యాక్స్TM టెక్నాలజీ తో కూడా సమృద్ధమై వస్తుంది, అది బయటి కొలతలను పెంచనవసరం లేకుండానే లోపలి వైపున అదనపు చోటును ఏర్పరచుకుంటుంది. ఇది 9 కేజీ మరియు 10 కేజీల కెపాసిటీలతో వస్తుంది. డిజిటల్ ఇన్వర్టర్ టెక్నాలజీ 40% వరకూ విద్యుత్తును ఆదా చేస్తుంది మరియు వాషింగ్ విడతల సందర్భంగా శబ్దాన్ని తగ్గిస్తుంది మరియు దీర్ఘకాలిక మన్నికను అందజేస్తుంది. ఈ కొత్త లైనప్ లో డిజిటల్ ఇన్వర్టర్ మోటర్ 12-సంవత్సరాల వ్యారెంటీతో వస్తుంది.
డిజైన్ మరియు రంగులు
ఈకోబబుల్TM పూర్తి ఆటోమేటిక్ టాప్ లోడ్ వాషింగ్ మెషీన్ శ్రేణి రియర్ కంట్రోల్ ప్యానల్ తో ఆధునికమైన డిజైన్ కలిగి ఉంటుంది మరియు ఐదు రంగులలో లభిస్తుంది – బ్ల్యాక్ సేవియార్, రోజ్ బ్రౌన్, డార్క్ గ్రే, లావెండర్ గ్రే మరియు లైట్ గ్రే; రోజ్ బ్రౌన్ మరియు డార్క్ గ్రే సంపూర్ణంగా కొత్త రంగు పరిచయాలుగా.
ధర మరియు లభ్యత
ఈ కొత్త శ్రేణి 2022 సెప్టెంబర్ 08 నుండి రు. 19,000 ప్రారంభ ధరతో మొదలై రు. 35,000 వరకూ వెళుతూ అందుబాటులో ఉంటుంది. ఎంపిక చేయబడిన మోడళ్ళు శామ్సంగ్ యొక్క అధీకృత ఆన్లైన్ స్టోర్ అయిన శామ్సంగ్ షాప్, రిటైల్ స్టోరులు మరియు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఇతర ఇ-కామర్స్ వేదికలపై లభిస్తాయి.
వ్యారెంటీ మరియు ఆఫర్లు
కొత్త శ్రేణి వాషింగ్ మెషీన్లను కొనుగోలు చేసే వినియోగదారులకు డిజిటల్ ఇన్వర్టర్ మోటర్ పై 12-సంవత్సరాల వ్యారెంటీ మరియు వాషింగ్ మెషీన్ పై 3-సంవత్సరాల వ్యారెంటీ ఇవ్వబడుతుంది. 2022, సెప్టెంబర్ 08 నుండి కొత్త శ్రేణిని కొనుగోలు చేసే వినియోగదారులు రు. 990 తో మొదలుకొని సులభమైన ఇఎంఐ ఆప్షన్లు మరియు 12.5% వరకూ క్యాష్‌బ్యాక్ కూడా పొందుతారు.
శామ్సంగ్ యొక్క కొత్త ఈకోబబుల్TM పూర్తి ఆటోమేటిక్ టాప్ లోడ్ వాషింగ్ మెషీన్ శ్రేణి ఫీచర్లు
ఈకోబబుల్TM టెక్నాలజీ
ఈకోబబుల్TM తో వేగంగా, మరింత సమర్థవంతంగా వాష్ చేయండి – ఇది రెండు ముఖ్య ఫీచర్లు బబుల్స్టార్మ్™, డ్యుయల్ స్టార్మ్™ పల్సేటర్ యొక్క సమ్మేళనము. బబుల్స్టార్మ్™ 2.5X వేగంగా డిటర్జెంటు పెనవేతకు వీలు కల్పించగా, డ్యుయల్స్టార్మ్™ పల్సేటర్, సమర్థవంతంగా దుస్తులి శుభ్రం చేయడం కోసం డ్రమ్ము లోపల బలమైన వాటర్ కరెంటును సృష్టించుకుంటుంది.
హైజీన్ స్టీమ్
డ్రమ్ము యొక్క అడుగుభాగం నుండి ఆవిరిని విడుదల చేయడం, లాండ్రీని సంపూర్ణంగా సంతృప్తీకరణ చేయడం ద్వారా హైజీన్ స్టీమ్ దుస్తుల్ని లోతంటా శుభ్రం చేస్తుంది. హైజీన్ స్టీమ్ పాతుకుపోయిన మురికిని తొలగిస్తుంది. 99.9% బ్యాక్టీరియా, అలర్జెన్లను తొలగిస్తుంది. దుస్తులను శానిటైజ్ చేయడానికి, మొండిమరకలు, నూనె మరకలను తొలగించడానికి వేడి నీరు మరియు 60°C ఆవిరితో లాండ్రీ లోతైన, పరిశుభ్రమైన శుభ్రతనిస్తుంది.
Wi-Fi తో స్మార్ట్ కంట్రోల్
Wi-Fi ఉపయోగించి మెషీన్ ని స్మార్ట్‌థింగ్స్ యాప్ కి కనెక్ట్ చేయడం ద్వారా, లాండ్రీ అనుభవము సులువుగా మరియు వినోదంగా మారుతుంది. రంగు, వస్త్రం రకం, మరియు వాడుకదారుచే ఇవ్వబడిన మురికి స్థాయి వంటి సమాచారం ఆధారంగా అనుకూలమైన వాష్ విడతల కోసం ఏ విడత చాలా బాగుంటుందో ఊహించుకునే అవసరాన్ని నివారిస్తూ లాండ్రీ రిసైప్ ఫీచర్ సిఫార్సులను ఇస్తుంది. అదే సమయములో, వాడుకదారులు తమ లాండ్రీ యొక్క ముగింపు సమయాన్ని షెడ్యూలు చేసుకోవడానికి లాండ్రీ ప్లానర్ వారికి వీలు కలిగిస్తుంది. హోమ్ కేర్ విజార్డ్ విద్యుత్తు వినియోగమును పర్యవేక్షణ చేయడంలో సహాయపడటమే కాకుండా, సంభావ్య సమస్యల గురించి వాడుకదారుల్ని అప్రమత్తం చేస్తుంది మరియు త్వరిత పరిష్కారాన్ని అందిస్తుంది.
సూపర్స్పీడ్™
ఈ ఫీచర్, 40% మామూలు లాండ్రీ సమయాన్ని తగ్గించుకోవడానికి, దుస్తుల్ని బాగా శుభ్రం చేసుకోవడానికి వాడుకదారులకు వీలు కలిగిస్తుంది. సూపర్స్పీడ్ ఒక లోడు దుస్తుల్ని కేవలం 29 నిముషాల్లోనే వాష్ చేస్తుంది. సూపర్స్పీడ్™ శక్తివంతమైన శుభ్రతను నిర్ధారిస్తుంది. ఈ టెక్నాలజీని ఉపయోగించి స్పిన్ వేగమును వేగవంతం చేయడం ద్వారా రిన్సింగ్ సమయము తగ్గిపోతుంది.
స్పేస్మ్యాక్స్
కొత్త శ్రేణి యొక్క 9, 10 కేజీల వేరియంట్లు స్పేస్మ్యాక్స్™ టెక్నాలజీతో వస్తాయి. ఈ విశిష్ట టెక్నాలజీ బయటి కొలతలను పెంచకుండానే లోపలివైపున మరింత చోటును ఏర్పరుస్తుంది.
డిజిటల్ ఇన్వర్టర్ టెక్నాలజీ
డిజిటల్ ఇన్వర్టర్ టెక్నాలజీ, సాంప్రదాయక మోటరు కంటే 40% తక్కువ విద్యుత్తును ఉపయోగించుకుంటూ శక్తివంతమైన పనితీరు, తక్కువ శబ్దము కోసం బలమైన మ్యాగ్నెట్లతో బ్రష్ లేని మోటరును వినియోగిస్తుంది. ఇది అధిక నాణ్యత గల కాంపొనెంట్లు మరియు అద్భుతమైన మెకానికల్ ఇంజనీరింగ్ నైపుణ్యముతో నిర్మితమయింది. ఇది మీ వాషింగ్ మెషీన్ కి సుదీర్ఘ జీవితకాల హామీని అందించే 12-సంవత్సరాల మోటర్ వ్యారెంటీతో వెన్నుదన్నుగా వస్తుంది.