Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జాబితాలో ప్రముఖ సంస్థల్లో బజాజ్ ఎలక్ట్రానిక్స్, బిగ్ సి, వివేక్స్, లాట్ మొబైల్స్, సెలెక్ట్, ఐటి వరల్డ్, ఉషా తదితరాలు ఉన్నాయి
హైదరాబాద్ : చిన్న మరియు మధ్య తరహా వ్యాపారాలకు భారతదేశంలోని అతి పెద్ద ప్రభుత్వేతర, లాభరహిత సంస్థ ఇండియా ఎస్ఎంఇ ఫోరం తన వినూత్న తరహా విక్రేతల పురస్కారాలు Best Sellers of India Awards 2022 - Recognising Phygital Excellence in Southern Indiaకు ఎంపికైన అత్యుత్తమ 100 విక్రేతల పేర్లను ప్రకటించింది. ఈ పురస్కారాలు వినియోగదారులకు అత్యాధునిక సదుపాయాలు మరియు డిజిటల్ పరిష్కరణలను అలవర్చుకోవడం ద్వారా అత్యుత్తమ డీల్స్ ద్వారా వృద్ధిని నమోదు చేసుకుంది మరియు మహమ్మారి సందర్భంలో సవాళ్ల నుంచి బయటకు వచ్చిన దక్షిణ భారతదేశంలోని రిటెయిలర్ల అసాధారణ సాధనలు మరియు శ్రేష్ఠతను గౌరవిస్తోంది.
ఆగస్టు 5న నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాగా, ఇండియా ఎస్ఎంఇ ఫోరం తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు గోవాతో కలిపి ఆరు దక్షిణాది రాష్ట్రాల్లో ఒక నెల మూల్యాంకన మరియు పరిశీలన అనంతరం అత్యుత్తమ 100 మంది విక్రేతల స్టార్ కేటలాగ్ తయారు చేసింది. ఈ ప్రాంతం నుంచి జాబితాలో చేరిన విక్రేతల్లో బజాజ్ ఎలక్ట్రానిక్స్, వివేక్స్, లాట్ మొబైల్స్, సెలెక్ట్, పాయ్ ఇంటర్నేషనల్, ప్రొటైల్, బీన్యూ, అప్ట్రానిక్స్, ఎస్.వి.కంప్యూటర్స్, ఉషా, బిగ్ సి, షార్ప్ట్రానిక్స్, సిరి మొబైల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, రతన్ ఎయిర్ కండిషనర్స్, సోనో విజన్, సెల్ పాయింట్ తదితరాలు ఉన్నాయి. నామినేషన్లు సెప్టెంబరు 25 వరకు దాఖలు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది మరియు రానున్న 2 వారాలు ఇక్కడ జాబితా షార్ట్‌లిస్ట్ ప్రక్రియ కొనసాగనుంది.
ఇండియా ఎస్ఎంఇ ఫోరం అధ్యక్షుడు వినోద్ కుమార్ మాట్లాడుతూ, 'మేము ఇప్పటి వరకు అందుకున్న దరఖాస్తులతో సంతోషంగా ఉన్నాము మరియు స్మార్టర్ పరిష్కరణలను అలవర్చుకోవడం ద్వారా ఆవిష్కారాలను కొనసాగిస్తున్న వారికి మద్దతు మరియు గుర్తింపు ఇచ్చేందుకు నిరీక్షిస్తున్నాము` అని తెలిపారు.
ఇండియా ఎస్ఎంఇ ఫోరం ప్రముఖులైన లోక్‌సభ సభ్యుడు అమర్ పట్నాయక్, సీసీఐ మాజీ అధ్యక్షుడు ధర్మేంద్ర కుమార్, భారత కేంద్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి, ఐఏఎస్, డా.అరుణ్ శర్మ, డిపిఐఐటి మాజీ కార్యదర్శి, ఐఏఎస్ రమేశ్ అభిషేక్, ఇండియా ఎస్ఎంఇ ఫోరం అధ్యక్షుడు ప్రహ్లాద్ కక్కర్, ఎకనామిక్ టైమ్స్ సంపాదకుడు టి.కె.అరుణ్, క్వెస్ట్ రిటెయిల్, ది బాడీషాప్ సీఈఓ శ్రుతి మల్హోత్రా, జినెసిస్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రశాంత్ లోహియా, సౌత్ ఇండియన్ బ్యాంకు జనరల్ మేనేజరు మరియు బిజినెస్ హెడ్ జి.డబ్ల్యూ.నందకుమార్ మరియు ఏసర్ ఇండియా అధ్యక్షుడు మరియు మేనేజింగ్ డైరెక్టర్ హరీశ్ కోహ్లి న్యాయనిర్ణేతల బృందంలో ఉన్నారు.
ది బెస్ట్ సెల్లర్స్ ఆఫ్ ఇండియా అవార్డులను 32 రిటెయిలర్లకు 8 వలయాలు మరియు 6 ప్రాంతాల్లో ఇవ్వనున్నారు. ప్రతి ఎంట్రీని ఆర్థిక అలాగే ఆర్థికేతర సూచికలైన ప్రగతికి సంబంధించిన పనితీరు, ఆర్థిక సదృఢత, భవిష్యత్తుకు తయారీగా ఉండే ప్రాధాన్యత మరియు డిజిటల్ ప్రయాణాల ఆధారంగా మూల్యాంకన చేయనున్నారు. దరఖాస్తు చేసుకునే సమయానికి కనీసం 3 ఏండ్ల నుంచి పని చేస్తున్న అన్ని వ్యాపార సంస్థలకు అర్హత ఉంటుంది.