Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : సిట్రోయెన్ ఇండియా మార్కెట్లోకి కొత్తగా సీ5 ఎయిర్‌క్రాస్ ఎస్‌యూవీని విడుదల చేసింది. దీని ఢిల్లీ ఎక్స్‌షోరూం ధరను రూ. 36.67 లక్షలుగా నిర్ణయించింది. అడ్వాన్స్డ్ కంఫర్ట్ సీట్లు, అసమానమైన బూట్ స్పేస్, మాడ్యులారిటీతో అందిస్తున్నట్లు ఆ కంపెనీ పేర్కొంది. ఈ వాహనం దేశంలోని 19 నగరాల్లోని తమ షోరూంల్లో లేదా 90కి పైగా నగరాల్లోని వారు ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేసుకోవడానికి వీలు కల్పిస్తున్నామని ఆ కంపెనీ తెలిపింది.