Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ప్రైస్వాటర్హౌజ్కాపర్స్ (పీడబ్ల్యూసీ)తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్టు ప్రముఖ ప్యాకేజింగ్ సంస్థ ఏజీఐ గ్రీన్పాక్ వెల్లడించింది. దీంతో పర్యావరణాన్ని బలోపేతం చేయడంతో పాటుగా సామాజిక, గవర్నెన్స్ లక్ష్యాలను చేరాలని నిర్దేశించుకున్నామని పేర్కొంది. ఈ ఒప్పందంలో భాగంగా పర్యావరణ భద్రత సంబంధిత నిర్వహణ కార్యకలాపాలను మరింత పటిష్టం చేసుకోనున్నట్టు ఏజీఐ గ్రీన్పాక్ సీఈఓ, ప్రెసిడెంట్ రాజేష్ కూస్లా పేర్కొన్నారు. కంపెనీ విస్తరణ ప్రణాళికలో పర్యావరణంపై ప్రతికూల ప్రభావం పడకుండా ఈ ఒప్పందం దోహదం చేయనుందన్నారు.