Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొనుగోలుకు అదానీ ఓపెన్ ఆఫర్
న్యూఢిల్లీ : ప్రముఖ మీడియా సంస్థ ఎన్డీటీవీలో ఎలాగైనా వాటాలను స్వాధీనం చేసుకోవాలని గౌతమ్ అదానీ నిర్ణయించుకున్నట్టు ఉన్నారు. ఈ చానెల్లోని 26 శాతం వాటాలను ఒపెన్ ఆఫర్ ద్వారా కొనుగోలు చేయడానికి అదానీ కంపెనీ ప్రణాళికను ప్రకటించింది. ఈ ఒపెన్ ఆఫర్ 17న ప్రారంభమై నవంబర్ 1న ముగిస్తుందని జేఎం ఫైనాన్సీయల్ గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. ఎన్డీటీవీకి రుణాలిచ్చిన విశ్వప్రధాన్ కమర్షియల్ (వీసీపీఎల్)కు చెందిన 29.18 శాతం వాటాలను అదానీ ఇటీవల దొడ్డిదారిన కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. మరో 26 శాతం వాటా కోసం తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎప్పటికప్పుడు ఎండగడుతోన్న ఎన్డీటీవీని మోడీకి అతి సన్నిహితుడైన అదానీ చేజిక్కిచ్చుకోవడమంటే మీడియా స్వేచ్ఛను హరించడమేనని తీవ్ర విమర్శలు ఉన్నాయి.