Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : దేశంలో అతి వేగంగా వృద్ధి చెందుతున్న కారు తయారీదారులలో ఒకటైన కియా ఇండియా, ఆంధ్రప్రదేశ్ లోని తమ ఆధునిక అనంతపురం ప్లాంట్ నుండి 1.5 లక్షల ఎగుమతులను దాటినట్లు ఈ రోజు ప్రకటించింది. భారతదేశపు మార్కెట్ లో తమ మొదటి ప్రోడక్ట్ ను ఆరంభించిన తరువాత వెంటనే ఇప్పటి వరకు, కంపెనీ 2009 సెప్టెంబర్ నుండి తమ ఎంతో ప్రసిద్ధి చెందిన సెల్టోస్, సోనెట్ మరియు కారెన్స్ సహా 150,395 యూనిట్స్ ను 95 దేశాలకు రవాణా చేసింది. ఈ విజయం కంపెనీ యొక్క 'మేక్ ఇన్ ఇండియా' ప్రయత్నాలలో భాగంగా జరిగింది మరియు భారతదేశంలో ప్రపంచ స్థాయికి చెందిన ఉత్పత్తులను తయారు చేయాలని మరియు అంతర్జాతీయంగా వాటిని తీసుకువెళ్లాలని తమ కలను శక్తివంతం చేసింది.
కియా సెట్లోస్ మొత్తం ఎగుమతులలో 72% గా ఉంది, తరువాత కియా సోనెట్ మరియు కొత్తగా ఆరంభించిన కియా కారెన్స్ లు ఈ స్థానాలను ఆక్రమించాయి. కంపెనీ 2022వ సంవత్సరంలో మొదటి ఎనిమిది నెలల్లో 54,153 యూనిట్స్ ను రవాణా చేసి ఈ సంవత్సరపు అతి పెద్ద యుటిలిటి వెహికిల్ (యూవీ) ఎగుమతిదారుగా మారింది. కియా ఇండియా కూడా 2021లో అతి పెద్ద యూవీ ఎగుమతిదారుగా నిలిచింది. మ్యూంగ్-సిక్ , ఛీఫ్ సేల్స్ అధికారి, కియా ఇండియా ఇలా అన్నారు, "అంతర్జాతీయంగా భారతదేశం కియా కోసం ఒక ముఖ్యమైన మార్కెట్ మరియు బలమైన సేల్స్, ఉత్పత్తి మరియు ఆర్ అండ్ డీ వేదికగా మారే సంభావ్యతను కలిగి ఉంది. మా ఆధునిక అనంతపురం ప్లాంట్ కియా నెట్ వర్క్ లో అత్యంత కీలకమైన ఎగుమతి వేదికలలో ఒకటిగా నిలిచింది మరియు ఆరంభం నుండి మా కార్యకలాపాలు ఇక్కడే ఉండటం వలన, నాణ్యతతో కూడిన ఉత్పత్తులను కేవలం దేశం లోపల కేటాయించడానికి మాత్రమే విదేశాలకు కూడా పంపిణీ చేయటానికి దృష్టి కేంద్రీకరించాము. ప్రపంచవ్యాప్తంగా యూవీలు ప్రసిద్ధి చెందడం ఎక్కువైంది మరియు మా మేడ్ ఇన్ ఇండియా యూవీలు అంతర్జాతీయ మార్కెట్లలో కూడా గొప్ప ప్రతిస్పందనను అందుకున్నాయి. ఇది భారతదేశం యొక్క తయారీ నైపుణ్యానికి నిజమైన సాక్ష్యం మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కస్టమర్స్ యొక్క తీరని అవసరాలను తీర్చడానికి ఉత్తమమైన ఉత్పత్తులను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని ప్రధానంగా చూపించింది." అంతర్జాతీయ మార్కెట్స్ లో సెల్టోస్, సోనెట్ మరియు ఇప్పుడు కారెన్స్ లు విస్త్రతంగా ప్రసిద్ధి చెందడం ఆరంభమవడంతో భారతదేశంలో తయారైన కియా ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా బలమైన డిమాండ్ ఉంది. ఇది సెప్టెంబర్ 2019 నుండి సెల్టోస్ ను షిప్పింగ్ చేయడం ఆరంభించడం వలన, కియా ఇండియా మధ్య ప్రాచ్యం, ఆఫ్రికా, కేంద్ర మరియు దక్షిణ అమెరికా, మెక్సికో మరియు ఆసియా పసిఫిక్ లకు కార్స్ ను ఎగుమతి చేసింది. 2022 ఆగస్ట్ లో, కంపెనీ నెలవారీ ఎగుమతులలో, అత్యంత అధికంగా 8,174 యూనిట్స్ ను పంపిణీ చేసి రికార్డ్ సృష్టించింది.