Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు వద్ద ఉన్న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక క్యాన్సర్ హాస్పిటల్, ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ లోని , నాట్కో క్యాన్సర్ సెంటర్ వద్ద నేడు డోజీ యొక్క కాంటాక్ట్‌లెస్ రిమోట్ పేషంట్ మానిటరింగ్ (ఆర్పీఎం) ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ (ఈడబ్ల్యుఎస్)ను హాస్పిటల్ వద్ద ప్రారంభించినట్లు వెల్లడించారు. ఈ ఉపకరణాలకు అడ్వాన్స్డ్ ఏఐ అల్గారిథమ్ శక్తిని అందించడం వల్ల రోగుల అత్యంత కీలకమైన లక్షణాలను క్యాన్సర్ చికిత్స సమయంలో గుర్తించడం జరుగుతుంది మరియు డాక్టర్లు, నర్సులు క్షీణిస్తోన్న రోగుల ఆరోగ్య పరిస్థితిని ముందుగానే గుర్తించి తగిన వైద్య చికిత్సలనందించడం వీలవుతుంది. ఇది డాక్టర్లు, నర్సులు అత్యుత్తమ సంరక్షణను మెరుగైన రోగి భద్రత తో పాటుగా నర్సింగ్ సిబ్బందికి నిర్వహణ సామర్ధ్యం మెరుగు పరచడంలోనూ తోడ్పడుతుంది. ఈ పరిష్కారాన్ని హాస్పిటల్‌కు మిలియన్ ఐసీయు కార్యక్రమంలో భాగంగా డోజీ అందించింది. తద్వారా భారతదేశంలో ప్రజా ఆరోగ్య సంరక్షణను సమూలంగా మార్చనుంది. అత్యధిక ప్రమాదంలోని క్యాన్సర్ రోగులు హాస్పిటల్‌కు చికిత్సకు వెళ్లనప్పుడు వారు హాస్పిటల్లో అంటువ్యాధుల బారిన పడే అవకాశాలున్నాయి. అందువల్ల వారికి సురక్షితమైన, కంటెయిన్డ్ వాతావరణంలో చికిత్సనందించాల్సి ఉంది. అదే సమయంలో, వారు అతి తీవ్రమైన చికిత్స తీసుకుంటుండటం వల్ల, వారిని అతి సన్నిహితంగా పర్యవేక్షించడంతో పాటుగా వారి ఆరోగ్య స్ధితిని సైతం నిరంతరం పర్యవేక్షిస్తుండాల్సి ఉంది. కనీస మానవ జోక్యంతో, డోజీ యొక్క సాంకేతికత ఈ అత్యంత కీలకమైన పారామీటర్లు అయినటువంటి హార్ట్ రేట్, రెస్పిరేషన్ రేట్, బ్లడ్ ప్రెజర్, ఆక్సిజన్ శాచురేషన్, ఈసీజీ, ఉష్ణోగ్రతలను పర్యవేక్షిస్తుంది. ఇది ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ (ఈడబ్ల్యుఎస్)ను సైతం అందిస్తుంది. ఇది సంబంధిత ఆరోగ్య సంరక్షణ ప్రదాతను ఆప్రమప్తం చేస్తుంది. ఈ తరహా అత్యంత కీలకమైన సమాచారం ఆరోగ్య సంరక్షణ నిపుణులకు తగిన డాటా అందించడంతో పాటుగా వేగవంతంగా నిర్ణయాలను వాస్తవ సమయంలో తీసుకునేందుకు తోడ్పడుతుంది. నిర్థిష్టమైన కీమోథెరఫీ చికిత్సలలో క్యాన్సర్ రోగుల ఆరోగ్య స్థితి తెలుసుకోవడం కీలకం. రాష్ట్ర ప్రభుత్వ సమగ్రమైన క్యాన్సర్ కేర్ రోడ్‌మ్యాప్‌లో నాట్కో క్యాన్సర్ సెంటర్ ఓ భాగం. నాట్కో ట్రస్ట్ దీని కోసం దాదాపు 45 కోట్ల రూపాయలను ఖర్చుచేసి ఈ అత్యాధునిక క్యాన్సర్ కేర్ హాస్పిటల్ నిర్మించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అత్యాధునిక సాంకేతికతను అందుబాటులోకి తీసుకురావడం కోసం 25 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసింది. హాస్పిటల్ బెడ్స్‌ను కనెక్టడ్ బెడ్స్‌గా అడ్వాన్స్డ్ సెన్సార్లతో కూడిన, క్లౌడ్ ఆధారిత ఏఐ శక్తివంతమైన అల్గారిథమ్స్ తో ఆధునీకరించడం అనేది నాన్ ఐసీయు వార్డ్లలో రోగి పర్యవేక్షణను ఆటోమేట్ చేయడంలో భాగం. అంతేకాదు, డోజీ ని హాస్పిటల్ యొక్క సెంట్రల్ కమాండ్ సిస్టమ్ మరియు డాక్టర్లు మరియు నర్సులతో అనుసంధానించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్పెషల్ సెక్రటరీ, డిజిటల్ హెల్త్ శ్రీ నవీన్‌కుమార్ జీఎస్ మాట్లాడుతూ ‘‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి దూరదృష్టి మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క సమగ్రమైన క్యాన్సర్ కేర్ రోడ్ మ్యాప్‌కు అనుగుణంగా గుంటూరు వద్ద నాట్కో క్యాన్సర్ సెంటర్ ఇప్పుడు రిమోట్ పేషంట్ మానిటరింగ్ ఉపకరణాలను ఏర్పాటుచేయడం ద్వారా క్యాన్సర్ రోగులకు మెరుగైన ఆరోగ్య సంరక్షణను అందించడానికి డోజీతో భాగస్వామ్యం చేసుకుంది. ప్రజా ఆరోగ్య సంరక్షణ వ్యవస్ధలో డిజిటల్ సాంకేతికతలను జోడించడం వల్ల గణనీయంగా క్యాన్సర్ రోగుల జీవిత నాణ్యత మెరుగుపడుతుంది. అదే సమయంలో మేడ్ ఇన్ ఇండియా సాంకేతికతల ద్వారా ఆవిష్కరణలకు అవసరమైన ప్రేరణ సైతం లభిస్తుంది’’ అని అన్నారు. నాట్కో గుంటూరు వద్ద హెడ్ ఆఫ్ రేడియేషన్ ఆంకాలజి– ప్రొఫెసర్ డాక్టర్ దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ ‘‘క్యాన్సర్ రోగుల ఆరోగ్య పరిస్థితిని అనుక్షణం పరిశీలించాల్సి ఉంది. వీరికి క్రిటికల్ కేర్ అవ సరం పడటంతో పాటుగా అంటువ్యాధుల బారిన పడే అవకాశాలూ చాలా ఎక్కువగా ఉంటాయి. డోజీ యొక్క కాంటాక్ట్‌లెస్ పేషంట్ మానిటరింగ్ స్వీకరించడంతో నర్సులు, డాక్టర్లు కీలకమైన రోగులకు ప్రాధాన్యత ఇవ్వవచ్చు. ఇది ఈ పరికరాలు పంపే అలర్ట్స్ ద్వారా సాధ్యమవుతుంది. డిజిటల్ ఆరోగ్య ఆవిష్కరణలు రోగి సంరక్షణలో అత్యంత కీలకమైన పాత్రను పోషించడంతో పాటుగా ఆరోగ్య సంరక్షణ సిబ్బందిపై భారమూ తగ్గిస్తున్నాయి’’ అని అన్నారు. ‘‘ నాట్కో గుంటూరుతో కలిసి పనిచేయడానికి మేము చాలా సంతోషిస్తున్నాము. ఈ మేడ్ ఇన్ ఇండియా ఆవిష్కరణతో, మేము రోగుల పర్యవేక్షణను మెరుగుపరచడం, రోగి భద్రతను మెరుగుపరచడం మరియు ఆంకాలజీ రోగులకు క్లీనికల్ ఫలితాలపై దృష్టి పెడుతున్నాము. దీనిద్వారా ఆంధ్రప్రదేశ్‌లో ప్రజా ఆరోగ్య సంరక్షణలో భారీ మార్పు తీసుకురావాలని మేము భావిస్తున్నాము. కాంటాక్ట్‌లెస్ పేషంట్ మానిటరింగ్ భవిష్యత్‌లో క్యాన్సర్ చికిత్స పరంగా హాస్పిటల్‌తో పాటుగా ఇంటిలో కూడా అత్యంత కీలకంగా నిలువనుందని మేము భావిస్తున్నాము’’ అని గౌరవ్ పర్చానీ, సీటీఓ అండ్ కో–ఫౌండర్, డోజీ అన్నారు.