Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ (MOFSL) మొట్టమొదటిసారిగా ఆర్థిక మార్కెట్ పరిశోధన &విశ్లేషణ ప్లాట్‌ఫారమ్ అయిన ‘రీసెర్చ్ 360’ని ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ ప్రత్యేక ప్లాట్‌ఫారమ్ మదుపరులు &వ్యాపారులు వివరణాత్మక ప్రాథమిక, సాంకేతిక పరిశోధనలను నిర్వహించడానికివన్ స్టాప్ గమ్యస్థానంగా పని చేస్తుంది, ఇది ఈక్విటీ, డెరివేటివ్‌లు, మ్యూచువల్ ఫండ్లు, థీమ్ &మోడల్ పోర్ట్ ఫోలియోలు మొదలైన వివిధ విభాగాలలో వివేకవంతమైన పెట్టుబడి లేదా ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడుతుంది. రీసెర్చ్ 360 యాప్ అనేది DIY కేటగిరీ మదుపరులకు, అలాగే రెడీమేడ్ రీసెర్చ్ సొల్యూషన్ల కోసం వెతుకుతున్న వారికి ఒక ప్రత్యేకమైన ప్రతిపాదన. 'RSEARCH 360' ప్రారంభం FY23లో డిజిటల్ ఉత్పత్తుల పోర్ట్ ఫోలియో విస్తరణలో ఒక భాగం.