Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: భారత్‌లో ఐఫోన్ల తయారీకి టాటా గ్రూపు సంప్ర దింపులు చేస్తోందని సమాచారం. ఇందుకోసం ఆపిల్ సరఫరాదారు విస్ట్రన్‌తో చర్చలు జరుపుతుందని బ్లూమ్‌బర్గ్ రిపోర్ట్ చేసింది. తైవాన్‌కు చెందిన విస్ట్రన్‌తో ఐఫోన్ల తయారీకి వీలుగా సంయుక్త భాగస్వామ్యం కోసం చర్చలు జరుగుతున్నాయని సమాచారం. భారత్‌లో ఆపిల్ కంపెనీ ఇప్పటికే ఫాక్స్‌కాన్, విస్ట్రన్, సెగట్రాన్లతో కలిసి ఐఫోన్ 12, ఐఫోన్ 13, ఐఫోన్ ఎస్ఇ, ఐఫోన్ 11 తదితర పోన్లను అసెంబ్లింగ్ చేస్తోంది. విస్ట్రన్‌తో భాగస్వామ్యం కుదిరితే టాటా గ్రూపు స్మార్ట్ ఫోన్ల తయారీ రంగంలోకి ప్రవేశించినట్లవుతుంది.