Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : మోతిలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ (ఎంఒఎఫ్ఎస్ఎల్) తొలి సారి ఆర్థిక మార్కెట్ పరిశోధన, విశ్లేషణ ప్లాట్‌ఫారమ్ అయిన 'రీసెర్చ్ 360'ని ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ ప్రత్యేక వేదిక మదుపరులు, వ్యాపారులకు పెట్టుబడుల్లో ప్రాథమిక, సాంకేతిక సమాచారాన్ని ఇస్తుందని పేర్కొంది. ఇది ఈక్విటీ, డెరివేటివ్‌లు, మ్యూచువల్ ఫండ్లు, థీమ్, మోడల్ పోర్ట్ ఫోలియోలు మొదలైన వివిధ విభాగాలలో వివేకవంతమైన పెట్టుబడి లేదా ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడుతుందని తెలిపింది.