Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- త్వరలో బిడ్లకు ఆహ్వానం
- మంత్రి అశ్విన్ వైష్ణవ్ వెల్లడి
న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగంలోని రైల్వే వ్యవస్థలోని అన్ని విభాగాల్లోనూ ప్రయి వేటుకు భాగస్వామ్యం కల్పించేలా మోడీ సర్కార్ వేగంగా నిర్ణయాలు తీసుకుంటుంది. తాజా గా రైళ్లకు కీలకమైన చక్రాల తయారీని కార్పొరేట్లకు అప్పగించనున్నట్లు ప్రకటన చేసింది. ప్రతీ ఏడాది రైల్వేలకు దాదాపు రెండు లక్షల చక్రాలు అవసరం ఉంటాయని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ శుక్రవారం మీడియాకు తెలిపారు. ఇందులో 80వేల చక్రాల తయారీని తొలిసారి ప్రయివేటు కంపెనీలకు ఇవ్వనున్నామని వెల్లడించారు. హైస్పీడ్ ట్రెయిన్లకు ఉపయోగించే ఈ చక్రాల తయారీకి త్వరలోనే బిడ్లను స్వీకరించనున్నామన్నారు. ఆ తర్వాత రైల్వే ట్రాక్‌ల తయారీలోనూ ప్రయివేటుకు భాగస్వామ్యం కల్పిం చనున్నామన్నారు. ఈ బిడ్డింగ్‌లో దేశీయ స్టీల్ కంపెనీలు, రైల్వే చక్రాల తయారీ కంపెనీలు పాల్గొనడానికి అవకాశం కల్పిస్తున్నామన్నారు. ప్రతీ ఏడాది ప్రభుత్వ రంగంలోని సెయిల్ 70వేల చక్రాలను రైల్వేకు అందిస్తుంది. రాష్ట్రీయా ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్ (ఆర్ఐఎన్ఎల్), ఇతర పిఎస్‌యులు కలిసి మరో లక్ష యూనిట్ల చక్రాలను అందిస్తున్నాయి. వచ్చే టెండర్లో బిడ్డింగ్‌ను దక్కించుకున్న కంపెనీలు చక్రాల తయారీ ప్లాంట్‌ను నెలకొల్పాల్సి ఉంటుందని వైష్ణవ్ తెలిపారు. ఈ ప్రాజెక్టుకు కనీసం రూ.1000 కోట్ల పెట్టుబడులు అవసరం అవుతాయన్నారు. ఇప్పటికే లీజు పేరుతో రైల్వే భూములను కార్పొరేట్లకు కట్టబెట్టేలా రైల్వే మంత్రిత్వ శాఖ చేసిన ప్రతిపాదనలకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రైల్వే భూముల లీజు కాలాన్ని ఐదేళ్ల నుంచి 35 ఏళ్లకు పెంచాలని నిర్ణయించింది. మరోవైపు 150 జతల ప్రయాణికుల రైళ్ల నిర్వహణను ప్రయివేటుకు కట్టబెట్టేలా చర్యలు తీసుకుంటుందని ఇటీవల రిపోర్టులు వచ్చిన విషయం తెలిసిందే.