Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చట్ట విరుద్ద లావాదేవీలపై దృష్టి
- దొంగ కంపెనీలపై దృష్టి పెట్టాలి
- మంత్రి సీతారామన్ వెల్లడి
న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతున్న చట్ట విరుద్ద రుణ యాప్‌ల ఆగడాల పై ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. అధిక వడ్డీల ను వసూలు చేస్తోన్న ఈ అక్ర మ యాప్‌ల భారిన పడి అనేక మంది ప్రాణాలు తీసుకోవడమో లేదా తీవ్ర అప్పుల పాలు అవుతున్న విషయం తెలిసిందే. దీనిపై శుక్రవారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. చట్టవిరుద్దమైన రుణ యాప్‌లపై చర్యలు తీసుకోవాలని ఇందులో నిర్ణయించారు. అనుమతులు కలిగిన రుణ యాప్‌లు మాత్రమే యాప్ స్టోర్‌లో ఉండేలా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండి యా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. అక్రమ రుణ యాప్‌ల ను గుర్తించాలని ఆదేశించింది. చట్టవిరుద్ద రుణ యాప్‌లు అధిక వడ్డీ రేట్లు వసూలు చేయడం, డబ్బు రికవరీ చేయడానికి బెదిరింపులకు పాల్పడటం వంటి అంశాలపై మంత్రి ఆందోళన వ్యక్తం చేశారని తెలుస్తోంది. రుణ యాప్‌లపై బ్యాంకు ఉద్యోగులు, లా ఎన్ఫోర్స్ మెంట్ ఏజెన్సీలు, ఇతర భాగస్వాములు సైబర్ అవగాహన పెంచేలా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. చట్ట విరుద్ద లావా దేవీలపై ఇడి, సిబిఐ దృష్టి సారించాలని సూచించారు. అదే విధంగా దొంగ కంపెనీలను గుర్తించాలని కార్పొరేట్ వ్యవహారాలు, ఆర్థిక శాఖల అధికారులకు తెలిపారు. వాటి గుర్తింపును రద్దు చేయాలన్నారు.