Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ విత్త సంస్థలు బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐఒబి)లు వడ్డీ రేట్లను పెంచుతు న్నట్లు వేరువేరుగా ప్రకటించాయి. మార్జినల్ కాస్ట్ లెండింగ్ రేటు (ఎంసిఎల్ఆర్) ను మరో 0.10 శాతం పెంచినట్లు ఐఒబి శనివారం తెలిపింది. దీంతో తమ రుణాలపై కనీస వడ్డీ రేటు 7.65 శాతం నుంచి 7.75 శాతానికి చేర్చినట్లు వెల్లడించింది. ఈ నిర్ణయం కార్లు, వ్యక్తిగత, గృహ రుణాలకు వర్తిస్తుందని తెలిపింది. ద్విచక్ర, త్రిచక్ర వాహనాల రుణ రేట్లు 7.80 శాతం నుంచి ప్రారంభమవుతాయని పేర్కొంది. పలు రుణాలపై ఏడాది కాల పరిమితి ఎంసిఎల్ఆర్ను 7.70 శాతం నుంచి 7.80 శాతానికి పెంచుతున్నట్టు బ్యాంక్ ఆఫ్ బరోడా రెగ్యూలేటరీ సంస్థలకు సమాచారం ఇచ్చింది. కొత్త వడ్డీ రేట్లు సెప్టెంబర్ 12 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది.