Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ 14 సెప్టెంబర్ 2022 : తమ దీర్ఘకాలిక వ్యూహంలో భాగంగా, ఫర్నిచర్ & ఫర్నిషింగ్స్ బ్రాండ్ ఇవోక్ 2023 ఆర్ధిక సంవత్సరాంతం నాటికి అదనంగా 15 స్టోర్లను తెరువనున్నట్లు వెల్లడించింది. తద్వారా భారతదేశ వ్యాప్తంగా తమ కార్యకలాపాలను వృద్ధి చేయనుంది. ఈ నూతన స్టోర్లను భారతదేశంలో అత్యంత కీలకమైన నగరాలు, సంభావ్య మార్కెట్లు అయిన అహ్మదాబాద్ , రాంచి, కోల్‌కతా, పాట్నా, పూనె, బెంగళూరు, భుబనేశ్వర్, వంటి చోట్ల ఏర్పాటుచేయనున్నారు.
ఈ బ్రాండ్ తమ 7వ స్టోర్‌ను ఢిల్లీ ఎన్సీఆర్లో ఏర్పాటుచేసినట్లు వెల్లడించింది. దాదాపు 4500చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ స్టోర్‌లో ప్రీమియం ఫర్నిచర్, ఫర్నిషింగ్, హోమ్ డెకార్ ఉత్పత్తులు ఉంటాయి. ఘిటోర్నీ – సౌత్ ఢిల్లీ వద్ద వ్యూహాత్మకంగా ఏర్పాటుచేసిన ఈ స్టోర్, తమ ఇండ్లు, ఆఫీస్ ప్రాంగణాలకు గృహ ఉత్పత్తులను కోరుకునే హై ఎండ్ వినియోగదారులకు ప్రధాన కేంద్రంగా వెలుగొందనుంది. ఈ స్టోర్‌ను ఆధునిక, డైనమిక్ ఇంటీరియర్స్ ఇంటీరియర్స్‌తో డిజైన్ చేయడం వల్ల అసలైన విలాసవంతమైన వాతావరణం ఆస్వాదించవచ్చు.
గృహ యజమానులు, ఆర్కిటెక్ట్స్, ఇంటరీయర్ డిజైనర్లకు అవసరమైన అన్ని ఫర్నిషింగ్ అవసరాలను తీర్చే ఏకీకృత పరిష్కారం ఈ స్టోర్. తమ ఇంటీరియర్స్‌ను సమూలంగా మార్చుకోవడం, నూతన ఫర్నిచర్‌కు అప్‌గ్రేడ్ చేయడం లేదా నూతన ప్రాంగణానికి అతి సరళమైన డిజైన్ అందించడం చేయవచ్చు.
అన్ని ప్రాంతాలలోనూ ఇవోక్ స్టోర్స్, వినియోగదారులు నూతన శ్రేణి హోమ్ ఫర్నిషింగ్స్ అయినటువంటి బెడ్స్,సోఫాలు, డైనింగ్ టేబుల్స్, రీక్లైనర్స్, లాంజర్స్, కాఫీ టేబుల్స్, టెలివిజన్ యూనిట్లు, మాడ్యులర్ కిచెన్స్, వార్డ్రోబ్స్, నుంచి స్టడీ టేబుల్స్, ఛైర్స్ సహా ఆఫీస్ ఫర్నిచర్ కొనుగోలు చేసేందుకు వినియోగదారులను అనుమతిస్తుంది.
ఈ విస్తరణ ప్రణాళికలను గురించి హింద్‌వేర్ హోమ్ ఇన్నోవేషన్ లిమిటెడ్ సీఈఓ- హోల్ టైమ్ డైరెక్టర్ శ్రీ రాకేష్ కౌల్ మాట్లాడుతూ 'వృద్ధి చేసిన రిటైల్ పాయింట్ల ద్వారా భౌతికంగా మా కార్యకలాపాలను మరింతగా విస్తరించనున్నాము. మా డిజిటల్ ప్లాట్‌ఫామ్ ఛానెల్స్ పై దృష్టిని కొనసాగించడంతో పాటుగా నూతన ఉత్పత్తులను పరిచయం చేయనున్నాము. దేశవ్యాప్తంగా పెరుగుతున్న ఈ బ్రాండ్ యొక్క ప్రాచుర్యం కారణంగానే వేగవంతంగా మా నెట్‌వర్క్‌ను విస్తరించే అవకాశం మాకు కలుగుతుంది` అని అన్నారు.
ఆయన ఇంకా మాట్లాడుతూ 'ప్రీమియం ఫర్నిచర్ మరియు ఫర్నిషింగ్ కోసం అత్యున్నత పనితీరు కనబరిచే మార్కెట్ ఢిల్లీ–ఎన్సీఆర్. మా 7వ స్టోర్‌ను ఘిటోర్నీ వద్ద ప్రారంభించడం ద్వారా డిమాండ్‌ను ఒడిసిపడుతున్నాము. మా వినియోగదారుల పట్ల మా నిబద్ధతను చాటనున్నాము మరియు వృద్ధి చెందుతున్న డిమాండ్ అవసరాలను ఈ మార్కెట్లో తీర్చనున్నాము` అని అన్నారు.
ఇవోక్ వద్ద ఫర్నిచర్ ఉత్పత్తులన్నీ కూడా ప్రీమియం సాలిడ్ ఉడ్ , ఇంజినీర్డ్ ఉడ్ తో తయారుచేయడంతో పాటుగా అత్యధిక స్ధాయి ధృడత్వంకు సైతం భరోసా అందిస్తుంది. ఫర్నిచర్‌తో పాటుగా ఈ బ్రాండ్ ఇప్పుడు విస్తృతశ్రేణిలో ఆకర్షణీయమైన హోమ్ డెకార్ ఉత్పత్తులు అయినటువంటి సీలింగ్ ల్యాంప్స్, క్లస్టర్ ల్యాంప్స్, ఫిగరిన్స్, క్యాండిల్ స్టాండ్స్ , వాల్ ఆర్ట్,కార్పెట్లు, రగ్గులు, బెడ్‌షీట్స్ మరియు వాల్ మిర్రర్స్ ఉంటాయి.
తమ రిటైల్ నెట్వర్క్ విస్తరణలో భాగంగా ఫ్రాంచైజీ భాగస్వామ్యాలపై ఇవోక్ పెట్టుబడులు పెడుతుంది. ఇటీవలనే, ఈ బ్రాండ్ ఎస్ఐఎస్ (షాప్ ఇన్ షాప్) స్టోర్‌ను ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడా వద్ద నున్న గార్డెన్స్ గ్యాలెరియా వద్ద తెరిచింది. ప్రస్తుతం ఇవోక్కు 32 ఫ్రాచైంజ్ స్టోర్లు , 2 కంపెనీ సొంత స్టోర్లు, 1ఎస్ఐఎస్ (షాప్ ఇన్ షాప్) స్టోర్ భారతదేశంలో ఉన్నాయి. ఆన్లైన్లో సైతం ఇవోక్ తమ కార్యకలాపాలను www.evok.in ద్వారా నిర్వహించడంతో పాటుగా పెప్పర్ ఫ్రై, అమెజాన్ వంటి వేదికలపై కూడా కార్యకలాపాలు నిర్వహిస్తుంది.