Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: రియల్ ఎస్టేట్ కంపెనీ జి స్క్వేర్ హౌజింగ్ తన కార్యకలాపాలను హైదరాబాద్‌కు విస్తరించినట్లు ప్రకటించింది. నగరంలో తన తొలి స్పోర్ట్స్ థీమ్డ్ ప్లాట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించినట్లు పేర్కొంది. నగరంలో బిఎన్ రెడ్డి నగర్‌తో పాటు షాద్‌నగర్‌లో మరో ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. ఇప్పటి వరకూ పలు నగరాల్లో 60 ప్రాజెక్టులను పూర్తి చేశామని జి స్క్వేర్ హౌజింగ్ సిఇఒ ఈశ్వర్ ఎన్ తెలిపారు. హైదరాబాద్ కోసం తాము భారీ ప్రణాళికలను రూపొందించామన్నారు.