Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : టాటా హిటాచీ తమ పూర్తి సరికొత్త 5 టన్ వీల్ లోడర్ జెడ్ డబ్ల్యు 225 ను హైదరాబాద్‌లో విడుదల చేసింది. ఈ మేడ్ ఇన్ ఇండియా మెషీన్ – ఆత్మనిర్భర్ భారత్ పట్ల కంపెనీ నిబద్ధతను చాటుతూనే నిరూపిత జపనీస్ సాంకేతికత శక్తినీ ప్రదర్శిస్తుంది. పూర్తి సరికొత్త టాటా హిటాచీ జెడ్డబ్ల్యు 225 వీల్లోడర్, విశ్వసనీయత, ఉత్పాదకత, పెట్టుబడులపై రాబడి పరంగా టాటా హిటాచీ యొక్క నిబద్ధతను ఉదహరిస్తుంది. ఈ జెడ్ డబ్ల్యు 225లో అత్యాధునికమైన సృజనాత్మక సాంకేతికతలు ఉన్నాయి. అసాధారణ ఉత్పాదకతను ఇంధన సామర్ధ్యం పరంగా ఎలాంటి రాజీపడకుండా అందిస్తుంది.జెడ్డబ్ల్యు 225 ఓ వైవిధ్యమైన వీల్ లోడర్. ఇది అప్రయత్నంగానే వైవిధ్యమైన అప్లికేషన్స్ సౌకర్యవంతంగా పూర్తయ్యేందుకు తోడ్పాటునందించడంతో పాటుగా , వినియోగదారుల సంపాదన సామర్ధ్యం మరింతగా పెంచుతుంది. ఆపరేటర్ సౌకర్యం పై మరింత శ్రద్ధ చూపడంతో పాటుగా మెషీన్ యొక్క ఉత్పాదక సామర్ధ్యం సైతం మరింతగా పెంచుతుంది. టాటా హిటాచీ జెడ్డబ్ల్యు 225లో కమ్మిన్స్ ఇంజిన్ ఉంది. ఇది సీఈవీ– 4 ఉద్గార ప్రమాణాలు కలిగి ఉండటంతో పాటుగా భారీ పర్యావరణ అవసరాలు మరియు పరిశుభ్రమైన వాతావరణం పట్ల మా దీర్ఘకాలపు నిబద్ధతకు ఉదాహరణగానూ నిలుస్తాయి. ఈ సమర్థవంతమైన మరియు శక్తివంతమైన కమ్మిన్స్ ఇంజిన్ సాటిలేని పనితీరుతో ఇంధన ఖర్చులను తగ్గించడంతో పాటుగా నిర్వహణ ఖర్చులనూ తగ్గిస్తుంది. టాటా హిటాచీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ సందీప్ సింగ్ మాట్లాడుతూ ‘‘ఐదు టన్నుల వీల్ లోడర్ జెడ్డబ్ల్యు 225ను విడుదల చేయడం టాటా హిటాచీ బృందానికి అత్యంత గర్వకారణం. నిరూపిత జపనీస్ సాంకేతికతతో ఇది తయారైంది. టాటా హిటాచీ జెడ్డబ్ల్యు 224 తమ సాటిలేని ఉత్పాదకత, విశ్వసనీయత, వైవిధ్యతతో వీల్ లోడర్‌గా మారుతున్న నిర్మాణ మరియు మైనింగ్ పరిశ్రమ అవసరాలను తీరుస్తుంది. ఈ లోడర్‌తో మేము మరింతగా మా వీల్ లోడర్స్ పోర్ట్‌ఫోలియోను వృద్ధి చేశాము మరియు ఆత్మనిర్భర్ లక్ష్యం దిశగా మా నిబద్ధతను పునరుద్ఘాటించాము’’ అని అన్నారు. శ్రీ తొషికి ఒనిషి, డైరెక్టర్ (సేల్స్, మార్కెటింగ్ అండ్ కస్టమర్ సర్వీస్) మాట్లాడుతూ ‘‘ జెడ్డబ్ల్యు సిరీస్‌ను భద్రత, సౌకర్యంతో పాటుగా మెషీన్ అప్‌టైమ్‌ను అత్యంత కీలకమైన అంశంగా డిజైన్ చేశాము. ఇది వినియోగదారులు అత్యంత సమర్థవంతంగా పనిచేసేందుకు తోడ్పడటంతో పాటుగా అత్యంత సవాల్‌తో కూడిన పరిస్థితులలో కూడా ఉత్పాదకతను మెరుగుపరిచే రీతిలో పనిచేసేలా తీర్చిదిద్దారు. హైదరాబాద్‌లో నేడు ఈ వాహనం విడుదల చేయడం పట్ల సంతోషం ఉన్నాము’’ అని అన్నారు. వైవిధ్యమైన ఫీచర్లు అయినటువంటి ఆటోమేటిక్ బకెట్ లెవలర్, ఆటో కిక్ ఔట్, ఆటోమేటిక్ ఫ్లోట్, ఎయిర్ కండీషనర్లు జెడ్డబ్ల్యు 225లో ఉండి వినియోగదారుల అవసరాలను తీరుస్తాయి. భద్రతా ఫీచర్లు అయినటువంటి రియర్ వ్యూ కెమెరా, ఆటోమేటిక్ సెంట్రలైజ్డ్ లూబ్రికేషన్ సిస్టమ్, ఆటోమేటిక్ ఫైర్ డిటెక్షన్, సస్టెన్షన్ సిస్టమ్, క్యాబిన్ ఫ్రంట్ గార్డ్ మొదలైనవి సైతం ఈ మెషీన్లో లభిస్తాయి. టాటా హిటాచీ జెడ్ డబ్ల్యు 225లో అంతర్గతంగా నిర్మించిన టెలిమాటిక్స్ సూట్ సైతం ఉంది. ఇది సంబంధిత సమాచారమైనటువంటి డైలీ మెషీన్ యుటిలైజేషన్, ఫ్యూయల్ లెవల్, అలారమ్స్ , మొబైల్ ఫోన్స్‌పై అలర్ట్స్ సైతం అందిస్తుంది. వెబ్ మరియు యాప్ ప్లాట్‌ఫామ్స్‌పై ఇన్సైట్ లభిస్తుంది మరియు దీనిని సులభంగా వినియోగించవచ్చు.