Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పిల్లలకు పూర్తి సౌకర్యం అందించే అత్యంత తేలికైన కాటన్‌తో తయారి
హైదరాబాద్ : పర్యావరణ అనుకూల బేబీ కేర్, బేబీ ఉత్పత్తులను తయారు చేయడంలో భారతదేశంలో అతిపెద్ద డీ2సీ బ్రాండ్‌గా ఖ్యాతి గడించిన సూపర్ బాటమ్స్ నేడు బుజ్జాయిల కోసం సూపర్ డ్రై ఫీల్ స్వాడెల్ వ్రాప్‌ను విడుదల చేసినట్లు వెల్లడించింది. అత్యంత తేలికైన కాటన్‌తో వీటిని తయారుచేశారు. ఈ నూతన, మృదువైన, స్వాడెల్ వ్రాప్లు సూపర్ సాఫ్ట్ కాటన్ ఫ్లీస్ లైనింగ్‌తో వస్తాయి. ఇవి సూపర్ డ్రై ఫీల్ లేయర్‌ను లోపల కలిగి ఉన్నాయి. శీతాకాలంలో వెచ్చగా, వేసవిలో చల్లదనం అందించడం వల్ల బుజ్జాయిలకు సౌకర్యంగా ఉంటుంది.
సీపీఎస్ఏఐ ధృవీకృతమైన ఈ నూతన స్వాడెల్ లో హానికరమైన రసాయనాలైనటువంటి అజో డైస్ వంటివి ఉండవు. ఈ స్వాడెల్ వ్రాప్‌ను కావాల్సిన పరిమాణానికి మార్చుకోతగిన రీతిలో ఉంటుంది. ఈ స్వాడెల్ వ్రాప్ ధర 500రూపాయలతో ప్రారంభమవుతుంది. సూపర్బాటమ్ వెబ్సైట్ తో పాటుగా అమెజాన్, నైకా, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ–కామర్స్ వేదికలు, భారతదేశ వ్యాప్తంగా బేబీ కేర్ స్టోర్స్ వ్యాప్తంగా లభిస్తాయి.
ఈ ఉత్పత్తుల ఆవిష్కరణ గురించి సూపర్బాటమ్ కో–ఫౌండర్, సీఈఓ పల్లవి ఉతగి మాట్లాడుతూ ‘‘భారతీయ మాతృమూర్తులను దృష్టిలో ఉంచుకుని, వారి బుజ్జాయిలకు ఎలాంటి అసౌకర్యం కలిగించని రీతిలో వ్రాప్‌ను ఖచ్చితమైన డిజైన్‌తో తీర్చిదిద్దాము. ఈ నూతన స్వాడెల్ వ్రాప్ ఆవిష్కరణతో, మేము సస్టెయినబల్, పర్యావరణ అనుకూల ఉత్పత్తుల పట్ల మా నిబద్ధతను కొనసాగిస్తున్నాము. బుజ్జాయిలు పూర్తి విశ్రాంతి తీసుకుంటూనే, ఆహ్లాదకరంగా రోజంతా గడిపేందుకు మా వంతు తోడ్పాటునందిస్తున్నాము’’ అని అన్నారు.