Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యువ వైతాళికులు గ్రాంట్స్ లో ఐఎన్ఆర్ 1 కోటి కోసం పోరాడుతారు
గురుగ్రామ్: విస్త్రతమైన శిక్షణా సమావేశాలు, టాప్ 50 పోటీ టీమ్స్ ను ఎంచుకున్న శామ్ సంగ్ ఇండియా టాప్ 10 టీమ్స్ ఆరంభోత్సవ టీమ్స్ ద్వారా భారతదేశపు Gen Z తరంలో నవ్యత, ఔత్సాహికత మరియు సామాజిక బాధ్యతల స్ఫూర్తిని సంబరం చేసే తమ జాతీయ విద్య ఆవిష్కరణ పోటీని, 'సాల్వ్ ఫర్ టుమారో' ను ప్రకటించింది.
మూడు రోజుల డిజైన్ థింకింగ్ బూట్ క్యాంప్, ఆరంభోత్సవపు కార్యక్రమాన్ని ఎఫ్ఐటీటీ మరియు శామ్ సంగ్ లో ఐఐటీ ఢిల్లీ క్యాంపస్ లో నిర్వహించాయి. క్యాంప్ కు మొత్తం 118 మంది హాజరయ్యారు మరియు తమ ఆవిష్కరణలను శామ్ సంగ్ జ్యూరీకి సమర్పించారు. పర్యావరణ సంరక్షణ, అట్టడుగు వర్గాలు వారికి ఆరోగ్య సంరక్షణ మరింత అందుబాటులో ఉంచడం, గ్రామీణ మహిళల కోసం బహిష్టుల సమయంలో పరిశుభ్రత మరియు ఒత్తిడి నిర్వహణలు వంటి రంగాలలో ఉత్తమమైన ఆలోచనలను సమర్పించిన టాప్ 10 టీమ్స్ ను శామ్ సంగ్ జ్యూరీ ఎంచుకుంది.
యువతలో నవీన సంస్క్రతిని ప్రోత్సహించడానికి, ప్రజలు, వర్గాల జీవితాలను పరివర్తనం చేసే ఆలోచనలకు మద్దతు ఇవ్వడానికి ఈ నవీన పోటీ కోసం దరఖాస్తు చేయడానికి భారతదేశంలో 16-22 సంవత్సరాలు వారి నుండి శామ్ సంగ్ సీఎస్ఆర్ చొరవ సాల్వ్ ఫర్ టుమారో, దరఖాస్తులను ఆహ్వానించింది. ఆరంభోత్సవ ఎడిషన్ లో రికార్డ్ స్థాయిలో 18,000 ప్లస్ రిజిస్ట్రేషన్స్ అందుకోబడ్డాయి.
టాప్ 10 టీమ్స్ ఇప్పుడు శామ్ సంగ్, విజ్ఞాన భాగస్వామి ఎఫ్ఐటీటీ, ఐఐటీ ఢిల్లీ ప్రమేయం ద్వారా తమ నైపుణ్యాలను మరింత మెరుగుపరచుకుంటాయి మరియు తమ ఆలోచనలను అభివృద్ధి చేసుకుంటాయి, నమూనాలను సృష్టించి నవంబర్ లో న్యూఢిల్లీలో జరిగే గ్రాండ్ ఫినాలేలో ప్రసిద్ధి చెందిన జ్యూరీకి సమర్పిస్తాయి. ఈ 10 టీమ్స్ నెట్ వర్క్ 18 గ్రూప్ సమర్పించే టీవీ సీరీస్ లో కూడా కనిపిస్తాయి మరియ తమ జాతీయ ఛానల్స్ పై మరియు ఓటీటీ ప్లాట్ ఫాం వూట్ లో అక్టోబర్ మరియు నవంబర్ లో ప్రసారం చేయబడతాయి.
టాప్ మూడు విజేత టీమ్స్ కోసం, శామ్ సంగ్ మొత్తం ఐఎన్ఆర్ 1 కోటి నిధులు అందిస్తుంది. వ్యవసాయం, విద్య, పర్యావరణం, ఆరోగ్య సంరక్షణ రంగాలలో భారతదేశపు కీలకమైన ఆందోళనలను పరిష్కరించడంలో సహాయపడటానికి తమ ఆలోచనలను తాము కలలు గనే స్టార్టప్ గా మలచడంలో ఒక అడుగు దగ్గర చేస్తుంది. "ఈ యువ పార్టిసిపెంట్స్ నుండి వివిధ రకాల పరివర్తనా ఆలోచనలను చూడటం మాకు ఎంతో ఆనందం కలిగించింది. వివిధ నైపుధ్యాలు నుండి వారు రావడం, భారతదేశంలో ప్రతి మూల నుండి రావడం మా హృదయాలను మరింతగా కదిలించింది. కొత్త పర్యావరణ వ్యవస్థ తలెత్తడం, Gen Z తరం ముందు వరుసలో ఉండటం ద్వారా నేడు భారతదేశంలో ఒక నిశ్యబ్దమైన విప్లవం జరుగుతోంది. మా ఫ్లాగ్ షిప్ సీఎస్ఆర్ ప్రోగ్రాం సాల్వ్ ఫర్ టుమారో, తమ చుట్టూ ఉన్న జీవితాలలో మార్పు చేయడానికి ప్రయత్నిస్తున్న యువ మేధస్సులకు సహాయం చేసి, సలహాని అందించడాన్ని కొనసాగిస్తుందని," శ్రీ.పార్థ ఘోష్, హెడ్, సీఎస్ ఆర్, శామ్ సంగ్ ఇండియా అన్నారు.
"శామ్ సంగ్ వారి సాల్వ్ ఫర్ టుమారో వంటి ప్లాట్ ఫాం అనేది యువ ఆవిష్కరణకర్తల వర్గాన్ని రూపొందించడానికి ఒక తొలి అడుగు. భారతదేశంలో ఆవిష్కరణ వ్యవస్థకు ప్రధానమైన ప్రోత్సాహం కావాలి మరియు సాల్వ్ ఫర్ టుమారో ఇందుకు యథాతథంగా సరిపోతుంది. మార్పును ఆరంభించడానికి భారతీయ యువతకు సామర్థ్యం, ఉద్దేశ్యాలు ఉన్నాయి. శామ్ సంగ్ తో కలిసి, సమాజం పురోగతి కోసం ఆ మార్పును మేము ప్రోత్సహించగలమని నేను ఖచ్చితంగా చెబుతున్నాను," ప్రొఫెసర్ రంగన్ బెనర్జీ, డైరక్టర్, ఐఐటీ ఢిల్లీ అన్నారు.
టాప్ 10 ఫైనలిస్ట్స్ వీరే :
బ్యాక్ యార్డ్ క్రియేటర్స్ - తమిళనాడుకు చెందిన ఒకే పోలికలో ఉండే రామన్ ఆర్, లక్ష్మణ్ ఆర్ కవలలు- నాన్-సర్జికల్ అడ్ హెసివ్ వినికిడి పరికరం అభివృద్ధి చేస్తున్నారు. ఇది సంప్రదాయబద్ధమైన వినిడికి పరికరం ఇంప్లాంట్స్ కంటే చవకైనది మరియు ప్రమాదకరమైన స్కల్ సర్జరీ అవసరాన్ని కూడా నిర్మూలిస్తుంది. ఈ పరికరం అన్ని వయస్సుల వారికి అనుకూలమైనది, పిల్లలకు కూడా ఎలాంటి ఆంక్షలు లేవు మరియు థెరపీ తరువాత మాట్లాడగలిగే సామర్థ్యాన్ని అందిస్తుంది.
ఉడాన్ - అందరూ యువతులే ఉన్న టీమ్ - ప్రిషా దుబే, అనుప్రియ నాయక్, వనలిక కోన్వర్ లు అట్టడుగు వర్గాలకు చెందిన మహిళల బహిష్టుల ఆరోగ్యంలో సహాయపడాలని కోరుకున్నారు. ఇప్పుడు లభిస్తున్న శానిటరి ప్యాడ్స్ ఖరీదైనవి. నాన్-బయోడిగ్రేడబుల్ కూడా. వీరు ముగ్గురూ చెరకు పిప్పిని ఉపయోగించి పర్యావరణహితమైన, సరసమైన, శుభ్రం చేయదగిన శానిటరీ ప్యాడ్స్ ను అభివృద్ధి చేస్తున్నారు.
ఆల్ఫా మానిటర్ - తెలంగాణాకు చెందిన హిమేష్ చదలవాడ స్మార్ట్ రిస్ట్ బ్యాండ్ అభివృద్ధి చేసాడు. ఇది అల్జీమర్స్ రోగులను పర్యవేక్షిస్తుంది. వారి సంరక్షకులు తమ ప్రవర్తనలో మార్పులు గురించి గ్రహించేలా అప్రమత్తం చేస్తుంది. హిమేష్ నాయనమ్మ కూడా అల్జీమర్స్ రోగి. ఈ డివైజ్ రోగి నాడీ మరియు రక్తపోటు వంటి ఆరోగ్య ప్రమాణాలను కూడా పర్యవేక్షిస్తుంది. రోగి మంచం నుండి దిగినప్పుడు, సంచరిస్తున్నప్పుడు సంరక్షకులకు, డాక్టర్ కు వెంటనే తెలియచేస్తుంది.
ఏబుల్ ఇన్నోవేషన్ - మహారాష్ట్రకు చెందిన ప్రతీక్ రఘువంశీ, ఆర్యన్ తొసారివల్ ల టీమ్ మూగ, చెవిటి, అంధ వ్యక్తులు కోసం స్మార్ట్ పరికరం పరిష్కారాన్ని అభివృద్ధి చేసింది. ఏబుల్ గ్లాసెస్ గా పిలువబడే ఈ పరికరం తమ చుట్టూ ఉన్న వ్యక్తులతో మూగ, చెవుడు, అంధ దివ్యాంగులు మెరుగ్గా సంబాషణలు చేయగలుగుతారు. పేటెంటెడ్ బోన్ కండక్షన్ ట్రాన్స్ డ్యూసర్ టెక్నాలజీ సహాయంతో, ఈ గ్లాస్ లు చెవిటి వారు శబ్దాన్ని వినేలా చేయగలవు. బిల్ట్-ఇన్ కెమేరా సెన్సర్, స్పీకర్ లు మరియు మూగ, చెవుడు వారి కోసం మాట్లాడుతుంది. ఇమేజ్ ప్రాసెసింగ్ మరియు ఏఐతో కలిపి మెషీన్ లెర్నింగ్ అంధులు తమ చుట్టు ప్రక్కల చూడటంలో సహాయపడుతుంది.
స్పూట్నిక్ బ్రైన్ - కర్ణాటకాకు చెందిన శంకర్ శ్రీనివాసన్ వేరబుల్ డివైజ్ అభివృద్ధి చేస్తున్నారు. ఇది ఒత్తిడ్ని తగ్గించడంలో సహాయపడుతుంది. అంతర్జాతీయ సమస్యగా నిలిచిన ప్రాణాంతకమైన ఒత్తిడ్ని నిర్వహించడానికి సురక్షితమై బ్రైన్ మాడ్యులేషన్ ద్వారా అతను ఆనందాన్ని అభివృద్ధి చేస్తున్నాడు. తీరని అవసరంగా నిలిచిన రసాయన & వ్యతిరేక ప్రభావరహితమైన ఆవశ్యకతని పూర్తి చేస్తున్నాడు. మానసికమైన ఆరోగ్యం కోసం అతని సురక్షితమైన బ్రైన్ మాడ్యులేషన్ వేరబుల్ డివైజ్ ఎఫ్ డీఏ వారి పరిమితమైన పౌనఃపున్యం , తీవ్రత మరియు పల్శ్ రిపిటీషన్ పిరియడ్ యొక్క పరిమితిలో మెదడులో మనోస్థితి కేంద్రాలకు తరంగాలను ప్రసారం చేస్తుంది.
ప్లాంటీర్స్ - ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన ముగ్గురు యువ మహిళల టీమ్ - రియా పి డే, నికిత పాఠక్, అక్షిత గాబా, ఆక్వారియస్ గా పిలువబడే స్వతంత్రప్రతిపత్తి కలిగిన భూగర్భ వాహనం రూపొందిస్తున్నారు. ఇది సముద్రం అట్టడుగున సూక్ష్మమైన నాన్ ప్లాస్టిక్స్ ను గుర్తించి, అక్యూమలేటర్ లోకి సేకరించగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంది. సీఏడీ - రాజస్థాన్ కు చెందిన రుషీల్ సరస్వత్ సరసమైన, పొందికైన డివైజ్ అభివృద్ధి చేస్తున్నారు. ఇది ఒక వ్యక్తి ప్రయాణిస్తున్నా కూడా వారి ఈసీజీని పర్యవేక్షించగలదు. స్మార్ట్ ఫోన్ యాప్ ద్వారా ఇది లైవ్ అప్ డేట్ చేస్తుంది. కార్డియాక్ అర్హిథ్మియా తీవ్రంగా ఉన్నట్లు గుర్తిస్తే అంబులెన్స్ ను మరియు కొంతమంది పరిచయస్తుల నంబర్స్ కు కూడా కాల్ చేస్తుంది.
బయోపాచ్ - ఢిల్లీ నుండి హృతిక్ జైశ్వాల్, అనిమేష్ కుమార్ లు ప్యాచ్ అభివృద్ధి చేస్తున్నారు. దీనిని ఎవరైనా తమ పొట్ట లేదా భుజం పై ధరించి తమ బ్లడ్ గ్లూకోజ్ స్థాయిలు గమనించవచ్చు. డయాబిటిక్ సమస్యలను నివారించవచ్చు. వీరి నమూనాను ఎంటోక్రైనాలజిస్ట్స్ పరీక్షించారు.
ఎస్ వీఏఆర్ - ఢిల్లీ నుండి తేజాస్ కుమార్, సయ్యద్ మొహమ్మద్. హుస్సేన్, ఉజ్జ్వల్ మాధుర్ లకు చెందిన టీమ్ మెషీన్ లెర్నింగ్ ఎంబెడెడ్ మొబైల్ యాప్ ను అభివృద్ధి చేసింది. ఇది స్పీచ్ థెరపీని ఆటోమేట్ చేస్తుంది. వ్యక్తిగతం చేస్తుంది. ప్రాంతీయ భాషలలో కూడా లభించే ఈ యాప్ సరసమైన ధరకు 24x7 వర్ట్యువల్ స్పీచ్ థెరపిస్ట్ ను అందిస్తుంది. యాప్ లో, సరిగ్గా పదాలను ఉచ్ఛారణ చేసిన పిల్లలకు పాయింట్లు బహుకరించబడతాయి. తమ సంభాషణను మెరుగుపరచుకోవడంలో మరింత కష్టపడేలా ఇది ప్రోత్సహిస్తుంది.
జేఎన్ వీ ఎఫ్ బీడీ మాన్ - ఫరీదాబాద్ లో జవహర్ నవోదయ విద్యాలయాకు చెందిన అజయ్, అక్షయ, తరుణ్ ల టీమ్ ఆటోమేషన్ ను ఉపయోగించి క్రచ్ గా మారే వీల్ ఛైర్ ను అభివృద్ధి చేస్తోంది. దీనిని దివ్యాంగులు లేదా స్వావలంబులుగా ఉండాలని కోరుకునే గాయపడిన వారు ఉపయోగించి తమ సంరక్షకులు పై ఆధారపడటం తగ్గించవచ్చు. బూట్ క్యాంప్ చివరిలో, టాప్ 50 టీమ్ సభ్యులలో ప్రతి సభ్యునికి పార్టిసిపేషన్ సర్టిఫికెట్ లభిస్తుంది. డిజైన్ థింకింగ్, ఎస్ టీఈఎం, నవ్యత, నాయకత్వం మొదలైన ఆన్ లైన్ కోర్స్ లు కోసం ఐఎన్ఆర్ 1 లక్ష విలువ గల వోచర్స్ కూడా అందుకుంటారు.
రాబోయే ఆరు వారాలలో, టాప్ 10 ఫైనలిస్ట్ తమ ఆలోచనలను మెరుగుపరచడానికి, పినాలే ఆరంభోత్సవపు కార్యక్రమంలో తాము చూపించబోయే నమూనాను రూపొందించడానికి టీమ్స్ శామ్ సంగ్ మరియు ఐఐటీ ఢిల్లీకి చెందిన మెటార్స్ తో కలిసి పని చేస్తారు. వారు గురుగ్రామ్ లో శామ్ సంగ్ ఇండియా వారి ప్రధాన కార్యాలయం, బెంగళూరు, నోయిడాలలో దాని ఆర్ & డీ కేంద్రాలను కూడా సందర్శిస్తారు. అక్కడ వారు యువ శామ్ సంగ్ ఉద్యోగులు, పరిశోధకులతో సంభాషణలు చేస్తారు. బెంగళూరులో దిగ్గజ శామ్ సంగ్ ఒపేరా హౌస్ లో శామ్ సంగ్ ఉత్పత్తి వ్యవస్థ అనుభవం కూడా పొందుతారు.
టాప్ 10 టీమ్స్ కు శామ్ సంగ్ హ్యాంపర్స్
టాప్ మూడు విజేత టీమ్స్ మొత్తం ఐఎన్ఆర్ 1 కోటి నిధులు పొందుతాయి. అదనంగా, గెలుపొందిన టీమ్స్ కూడా ఒక్కొక్కటి తమ సంబంధిత పాఠశాలలు, కాలేజీలలో 85 అంగుళాల శామ్ సంగ్ ఫ్లిప్ ఇంటరాక్టివ్ డిజిటల్ బోర్డ్ ను కూడా పొందుతాయి. లభించిన నిధులతో, విజేతలు ఐఐటీ ఢిల్లీకి చెందిన గురువులతో 6 నెలలు పని చేసే అవకాశం పొందుతారు మరియు ఐఐటీ ఢిల్లీ క్యాంపస్ లో ఇన్ కుబేషన్ కేంద్రంలో ప్రవేశ యోగ్యతని పొందుతారు. ఈ 6 నెలల్లో, వారు తమ ఆలోచనలు పై పని చేస్తారు మరియు తమ నమూనాలు కోసం వినియోగదారుల ధృవీకరణను కోరే వేదికకు తీసుకువెళ్తారు. శామ్ సంగ్ ఇండియా జూన్ 2022లో సాల్వ్ ఫర్ టుమారో ఆరంభోత్సవ ఎడిషన్ ప్రారంభాన్ని ప్రకటించింది.