Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : ప్రభుత్వ రంగంలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ప్రధానమైన డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాజెక్ట్ 'సంభవ్'లో భాగంగా పరిశ్రమలోనే తొలిసారి కిసాన్ క్రెడిట్ కార్డ్ (కేసీసీ) సంపూర్ణ డిజిటలైజేషన్‌ను చేపట్టినట్టు ప్రకటించింది. కేసీసీ రుణ ప్రక్రియను డిజిటలైజ్ చేయడం, దీనిని మరింత సమర్థవంతంగా, రైతు స్నేహపూర్వకంగా మార్చడం దీని లక్ష్యమని ఆ బ్యాంక్ తెలిపింది. బ్యాంక్ శాఖను సందర్శించకుండానే పంట పొల ధ్రవీకరణ ఆన్లైన్లో చేయబడుతుందని యూబీఐ సీఈఓ మణిమేఖలై పేర్కొన్నారు. రుణ మొత్తం మంజూరు విడుదల ప్రక్రియ రెండు గంటల్లో పూర్తి కావడం వల్ల బ్యాంక్‌ల చుట్టు తిరిగే సమయం తగ్గుతుందన్నారు.