Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : క్యాబ్ సేవల సంస్థ ఓలాలో వందలాది మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికిందని సమాచారం. సంస్థ పునర్నిర్మాణం పేరుతో ఇటీవల పలు దఫాల్లో సిబ్బందికి ఎసరు పెట్టిన కంపెనీ తాజాగా మరో 500 మందిని విధుల నుంచి తొలగించినట్టు తెలుస్తోంది. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మకాలు భారీగా పడిపోవడంతోనే ఉద్యోగుల తొలగింపునకు పాల్పడిందని రిపోర్టులు వస్తున్నాయి. గతేడాది డిసెంబర్లోనే ఓలా ఇవి వెహికల్స్‌ను ఆవిష్కరించింది. అప్పటి నుంచి కూడా సంస్థ పునర్నిర్మాణ ప్లాన్లను ప్రకటిస్తుంది. ఈ క్రమంలో ప్రీ ఓన్డ్ కార్ బిజినెస్, ఓలా కార్స్, ఓలా డాష్లలోని దాదాపు 2వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. గడిచిన జులైలో ఓలాకు చెందిన కర్ణాటక ప్లాంటును షట్ డౌన్ చేసింది. ఆ తర్వాత మూడు వారాల్లో సుమారు 350మంది ఉద్యోగుల్ని విధుల నుంచి తొలగించింది. తాజాగా మరో 500 మంది ఉద్యోగుల్ని తొలగించినట్లు వస్తున్న రిపోర్టులపై ఆ కంపెనీ వివరణ ఇచ్చింది. తమ కంపెనీ సాఫ్ట్‌వేర్‌లోని 200 మంది ఇంజనీర్లను మాత్రమే తొలగించిందని ఆ కంపెనీ స్పష్టం చేసింది. తమ సంస్థలో 2వేల మంది ఇంజనీర్లు పని చేస్తున్నారని.. అందులో 10 శాతం మందికి మాత్రమే ఉద్వాసన పలికామని పేర్కొంది.