Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : నగర కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోన్న డి2సి డెయిరీ బ్రాండ్ సిద్స్ ఫార్మ్ తమ ఎ2 గేదె పాల ధరలను పెంచినట్లు ప్రకటించింది. 500 మిల్లీ లీటర్ల ప్యాక్‌పై రూ.2 పెంచి రూ.50కి చేర్చినట్లు తెలిపింది. పెంచిన ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొంది. గత ఆరు నెలలో ముడి గేదె పాల ధరలు 12 శాతం పైగా పెరగడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని సిద్స్ ఫార్మ్ వ్యవస్ధాపకులు డాక్టర్ కిశోర్ ఇందుకూరి పేర్కొన్నారు. ఆవు పాల ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదని వెల్లడించింది.