Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : రాబోయే పండగ సీజన్లో విమానయానం భారం కానుంది. దసరా, దీపావళి సమయాల్లో విమాన సర్వీసుల కోసం ప్రయాణికులు ఇంటర్నెట్లో శోధించడం 25-30 శాతం పెరిగిందని ఆన్లైన్ ట్రావెల్ పోర్టల్ ఇక్సిగో వెల్లడించింది. కరోనాతో గత రెండేళ్లు విమాన ప్రయాణంపై పలు ఆంక్షలు అమలు చేశారు. ఈ ఏడాది చాలా మంది తమ స్వస్తలాలకు వెళ్లి రావడానికి ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో విమాన రంగానికి డిమాండ్ పెరగనుందని ఇక్సిగో పేర్కొంది. దీంతో ముఖ్యంగా మెట్రో నగరాల మధ్య విమాన ధరలు గతేడాదితో పోల్చితే 20-30 శాతం పెరుగొచ్చని అంచనా వేసింది. ఇప్పటికే ముంబయి-ఢిలీ, బెంగళూరు-ఢిల్లీ, హైదరాబాద్-ఢిల్లీ మధ్య విమాన ఛార్జీల్లో 20-33 శాతం పెరిగినట్టు ఇక్సిగో తెలిపింది.