Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్ : ప్రస్తుత ఏడాదిలో ఫేస్బుక్ సహ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ సంపద లక్షల కోట్లు ఆవిరయ్యింది. 2022లో ఇప్పటి వరకు నికర సంపదలో 71 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.5.60 లక్షల కోట్లు) హరించుకుపోయింది. దీంతో బ్లూమ్‌బెర్గ్ కుబేరుల జాబితాలో అత్యంత ఎక్కువ సంపద కోల్పోయిన వ్యక్తిగా నమోదయ్యారు. ప్రస్తుతం బ్లూమ్‌బర్గ్ జాబితాలో జుకర్ బర్క్ 20వ స్థానానికి పడిపోయారు. 2014 తర్వాత ఆయన ర్యాంకు ఈ స్థాయికి దిగజారడం ఇదే తొలిసారి. రెండేళ్ల క్రితం జుకర్‌బర్గ్ సంపద 106 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.8.44 లక్షల కోట్లు)గా ఉంది. గతేడాది ఫేస్బుక్ పేరును మెటాగా మార్చినప్పటి నుంచి స్టాక్ మార్కెట్లలో ఆ కంపెనీ షేరు పడిపోవడం మొదలయ్యింది.