Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబైల్ లో ఒక కొత్త వ్యూహాత్మక హబ్‌ని జోడిస్తోంది.
2000+ పిన్‌కోడ్ ప్రదేశాల వ్యాప్తంగా తన నెట్వర్క్ శీఘ్రంగా ఎదుగుతోంది
మరిన్ని ప్రాంతీయ కేంద్రాలతో అనుసంధానం కావడానికై 2023 మొదటి త్రైమాసికం నాటికి మరో 10 హబ్స్ అభివృద్ధి చేయాలని యోచిస్తోంది
గుర్గాంవ్, 2022 – ఈ సంవత్సరం మే నెలలో UPS మరియు ఇంటర్ గ్లోబ్ ఎంటర్ప్రైజెస్ మధ్య ఒక ఉమ్మడి భాగస్వామ్య సంస్థగా ప్రారంభించబడిన రవాణా మౌలిక సదుపాయాల బ్రాండు మూవిన్ (MOVIN), మెట్రో నగరాలు మరియు టయర్ I మరియు II నగరాల వ్యాప్తంగా 28 నగరాలకు తన నెట్వర్క్ విస్తరణను ప్రకటించింది. తన వ్యూహాత్మక విస్తరణలో భాగంగా, భివాండీ, మహారాష్ట్రలో అత్యంత ఇటీవలనే నెలకొల్పి జోడించిన దానితో సహా దేశవ్యాప్తంగా కూడా తన హబ్ లను నెలకొల్పుతోంది. 2023 మొదటి త్రైమాసికం నాటికి మరిన్ని ప్రాంతీయ కేంద్రాలతో అనుసంధానం కావాలనే తన వ్యూహములో భాగంగా మరో 10 హబ్స్ అభివృద్ధి చేయాలని మూవిన్ యోచిస్తోంది. ఇది తన అందజేతలను మరింత బలోపేతం చేస్తుంది మరియు B2B లాజిస్టిక్స్ చోటులో ఎప్పటికీ-విస్తరించే అవకాశాన్ని గ్రహించే తన సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది.
సాంకేతిక పరిజ్ఞానముతో ముందుకు నడిచే ఆవిష్కరణల తోడ్పాటుతో తన కార్యకలాపాల ఈ విస్తరణ ద్వారా, మూవిన్ ఎక్స్‌ప్రెస్ ఎండ్-ఆఫ్-డే మరియు ప్రామాణిక ప్రీమియం డెలివరీ సేవలు ఇప్పుడు 2000+ పిన్‌కోడ్ ప్రదేశాల వ్యాప్తంగా ఉన్న కస్టమర్లకు అందజేయబడతాయి. మూవిన్ విశిష్టమైన అందజేతలలో, దేశవ్యాప్తంగా పూర్తిగా ఊహించదగిన, రోజు మరియు సమయపు కచ్చితమైన సేవలు చేరి ఉంటాయి. భూమి, ఆకాశం రెండింటిలోనూ అతివేగంగా ఎదుగుతున్న దీని నెట్వర్క్, స్థిరమైన, ఊహించదగిన మరియు స్పందనాత్మక కార్యకలాపాల వెన్నుదన్నుగా అంతరాయము లేని సరుకుల తరలింపుకు వీలు కలిగిస్తోంది. భారతదేశ వ్యాప్తంగా కొత్త హబ్ లను నెలకొల్పడం ద్వారా మూవిన్ యొక్క విస్తరణ పలు హక్కుదారులతో సమన్వయం చేసుకొని మరియు అంకితమైన కస్టమర్ అనుభవ కేంద్రాలను నిర్వహిస్తూ పికప్ మరియు డెలివరీ కోసం పిన్కోడ్ల సంఖ్యను పెంచడమనేది సేవా నాణ్యతలో ఒక గీటురాయిని ఏర్పరుస్తోంది మరియు కస్టమర్లకు విలువ-ఆధారిత పరిష్కారాలను అందజేస్తోంది.
ఎక్స్‌ప్రెస్ ఎండ్-ఆఫ్-డే నెట్వర్క్, 2000+ పిన్‌కోడ్ ప్రదేశాలకు సేవలందిస్తూ, The అహ్మాదాబాద్, అమృత్సర్, బరోడా, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, చండీఘర్, చెన్నై, కొచ్చిన్, కోయంబత్తూర్, ఢిల్లీ-NCR, గోవా, హైదరాబాద్, ఇండోర్, జైపూర్, జలంధర్, కాన్పూర్, కోల్‌కతా, లక్నో, మంగళూరు, ముంబై, పాట్నా, పుణె, రాయపూర్, రాంచీ, సూరత్, విజయవాడ మరియు విశాఖపట్నం, ఈ మొత్తం 28 నగరాలను కవర్ చేస్తోంది.
మూవిన్ యొక్క ప్రామాణిక ప్రీమియం నెట్వర్క్ అహమ్మదాబాద్, బెంగళూరు, చండీఘర్, చెన్నై, కొచ్చిన్, కోయంబత్తూర్, ఢిల్లీ-NCR, హైదరాబాద్, జైపూర్, కాన్పూర్, లక్నో, ముంబై, మరియు పుణె పేరు గల 13 నగరాలలో ఉంది.
“ఈ సంవత్సరం మే నెలలో ప్రారంభించినప్పటి నుండీ మూవిన్ యొక్క గణనీయమైన ఎదుగుదల, అనుకూలీకృతమైన టెక్నాలజీ ఆధారిత శిక్షణచే భాగస్వాముల కొరకు సామర్థ్యాలను పెంపొందించడం ద్వారా భాగస్వామిచే ముందుకు నడుపబడే విధానమును అలవరచుకోవడమనే మా వ్యూహానికి అనుగుణంగా ఉంటోంది. మేము ప్రాంతీయ కేంద్రాల ద్వారా మా కస్టమర్లకు గొప్పదైన కవరేజీ అందిస్తూ మా వ్యూహాత్మక హబ్స్ తో మెట్రో నగరాలు, టయర్ l మరియు టయర్ ll నగరాలను అనుసంధానం చేసుకోవడం ద్వారా అతివేగంగా విస్తరిస్తున్నాము. మా వ్యూహాత్మక హబ్స్ ఉత్తర, పశ్చిమ మరియు దక్షిణ భారతదేశాన్ని కవర్ చేస్తూ మా ప్రామాణిక ప్రీమియం సేవల కోసం తరలింపులో స్పర్ధాత్మకమైన సమయానికి అందజేస్తున్నాయి. కస్టమర్ సంతృప్తి మా అత్యంత ప్రాధాన్యతగా ఉంటుంది, పనిలో ఆటోమేషన్ మరియు విశ్వసనీయత ద్వారా మేము దానిని సాధిస్తాము. మూవిన్ యొక్క ఇటీవలి విస్తరణ వస్త్రాలు, ఎలక్ట్రానిక్స్, ఐటి, పెరిఫరల్స్, ఆటోమోటివ్ కాంపొనెంట్లు, ఆరోగ్య సంరక్షణ మరియు ఇ-కామర్స్ విభాగాల వ్యాప్తంగా మా B2B కస్టమర్ల నుండి అద్భుతమైన స్పందన యొక్క ఫలితముగా ఉంది”, అన్నారు ఇంటర్‌గ్లోబ్ ఎంటర్ప్రైజెస్ డైరెక్టర్, మరియు మూవిన్ ఎక్స్‌ప్రెస్ బోర్డు సభ్యులు జెబి సింగ్.
తదుపరిగా, భారతీయ వ్యాపారాలు మార్పిడితో ప్రపంచ విలువ చైన్ లోనికి సమీకృతం కావడానికి సహాయడేందుకై పెంపొందిత ఊహాత్మకత, మెరుగైన కస్టమర్ అనుభవం మరియు గొప్పదైన స్పర్ధాత్మకతను పెంపొందిస్తూనే వాటిని సమన్వయం చేసుకొని మరియు అనుసరించుటలో ఈ విస్తరణ మూవిన్ యొక్క సామర్థ్యమును ప్రదర్శించి చూపుతుంది. “అత్యుత్తమ-స్థాయి సామర్థ్యాలు, బలమైన పంపిణీ మార్గాలు, అధునాతనమైన నూతన టెక్నాలజీ మరియు ప్రపంచస్థాయి ఉత్తమ ఆచరణలను తీసుకురావడం ద్వారా అత్యుత్తమ-శ్రేణి కస్టమర్ అనుభవాన్ని అందించడానికి మేము కట్టుబడి ఉన్నాము.”, అని శ్రీ సింగ్ తెలిపారు.
మూవిన్ ఇండియా వ్యాప్తంగా తన చేరువను విస్తరించడం కొనసాగిస్తుంది మరియు త్వరలోనే తన ఎక్స్‌ప్రెస్ ఎర్లీ మార్నింగ్ (ఉదయం 10.30 లోపు) మరియు ఎక్స్‌ప్రెస్ మిడ్-డే (మధ్యాహ్నానికి ముందు) సేవను విస్తరిస్తుంది.