Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : టెన్షన్ లేని మోటార్ ఇన్సూరెన్స్ రిన్యూవల్స్ పై దృష్టిలో పెట్టుకుని ఒక సమగ్ర మల్టీమీడియా బ్రాండ్ క్యాంపెయిన్ ను ఆవిష్కరిస్తామని భారతదేశపు అగ్రగామి డిజిటల్ పేమెంట్ల వేదిక PhonePe నేడు ప్రకటించింది. భారతదేశ వ్యాప్తంగా సాగించనున్న ఈ క్యాంపెయిన్ ను మొత్తంపై ఎనిమిది యాడ్ ఫిలింలతో దశల వారీగా ఆవిష్కరించనున్నామని తెలిపింది. విక్రయ ప్రయత్నాలు నేడు అవాంఛనీయ కొనుగోలు అనుభవంగా మారడంతో వినియోగదారులు ఎదుర్కుంటున్న నిజమైన రోజువారీ సమస్యలను ఇది ప్రధానంగా నొక్కి చూపుతోంది. PhonePeలో టెన్షన్ లేని మోటార్ ఇన్సూరెన్స్ ను రిన్యూ చేయడం ద్వారా కలిగే ప్రయోజనాల చుట్టూ అవగాహన కల్పించేలా ఈ క్యాంపెయిన్ ను ముందుకు తీసుకువెళ్లనుంది..
PhonePe వేదికలో మోటార్ ఇన్సూరెన్స్ రిన్యూవల్స్ కోసం విభాగం సృష్టి మరియు పరిగణనను ముందుకు నడిపించడంపై దృష్టి పెట్టిన ఈ క్యాంపెయిన్ తమకు సంప్రదాయబద్ధంగా బైక్, కార్ ఇన్సూరన్స్ ను విక్రయించేందుకు అనుసరించే మార్గాన్ని ప్రశ్నించే రీతిలో వినియోగదారులకు స్ఫూర్తి నిస్తోంది. నార్త్ ఇండియా మార్కెట్లలోని హిందీ మాట్లాడే వారి కోసం అమీర్ ఖాన్, ఆలియా భట్ లు పాత్రధారులుగా ప్రత్యేకంగా రూపొందించిన క్రియేటివ్ లను ఉపయోగిస్తుండగా, దక్షిణాదిలోని తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలకోసం దుల్కర్ సల్మాన్ పాత్రధారిగా క్యాంపెయిన్ రూపొందించారు.
తేలిగ్గా అర్థమయ్యే ఈ ఫిలిం సిరీస్ ద్వారా వినియోగదారులు PhonePeతో అన్ వాంటెడ్ సేల్స్ కాల్స్, అనవసరమైన యాడ్-ఆన్ లు మరియు ఇతర పరిమితమైన ఆప్షన్లతో సర్దుకుపోవాల్సిన అవసరముండదనే విషయంపై అవగాహన కల్పించనుది. వినియోగదారులకు బెస్ట్ ప్రైస్ ఎంచుకునే శక్తి కల్పించేలా విస్తృత ఆప్షన్ల శ్రేణితో ఈ వేదికలో బైక్, కార్ ఇన్సూరెన్స్ ఉత్పత్తులు రెండూ ఉన్నాయి. ఇది పూర్తయితే, వ్యక్తిగత తనిఖీ లేకుండా ఇన్సూరెన్స్ తక్షణమే రిన్యూ చేయబడుతుంది. ఇది అందుబాటు ధరల్లోనే లభిస్తుంది. బాగా అర్థమయ్యేలా ఉన్న ఈ బ్రాండ్ వైఖరి ఇన్సూరెన్స్ కొనుగోలును తేలికైనదిగా, సులభమైనదిగా, టెన్షన్ లేనిదిగా చేయడమే కాకుండా ఈ విభాగంలో PhonePeను ప్రత్యేకంగా నిలుపుతోంది.
ఈ కొత్త బ్రాండ్ క్యాంపెయిన్ గురించి PhonePe బ్రాండ్ మార్కెటింగ్ విభాగం డైరెక్టర్ రమేశ్ శ్రీనివాసన్ మాట్లాడుతూ, “మేము ఇటీవల జరిపిన వినియోగదారు పరిశోధన ఆధారంగా, ఇన్సూరెన్స్ పరిశ్రమలో ప్రస్తుతం ఎదుర్కుంటున్న సవాళ్లలో కొన్నిటిని గుర్తించగలిగాము. ఈ పరిశోధన ఫలితాలు వినియోగదారుల దృష్టిలో అవాంఛనీయ సేల్స్ కాల్స్ లేదా అనవసరమైన యాడ్-ఆన్ ల విషయంలో అసంతృప్తి ఉన్నట్టు తెలిసింది. మా యాప్ ను వినియోగిస్తున్న వారి అవసరాలపై పెట్టుబడి పెట్టేందుకు ఈ వినియోగదారుల అభిప్రాయాలను ఆధారంగా చేసుకునే మా తాజా ఇన్సూరెన్స్ క్యాంపెయిన్ ను నిర్మించాము. PhonePeలో మేము అవాంఛనీయమైన సేల్స్ కాల్స్ ద్వారా వినియోగదారులు ఎదుర్కుంటున్న సమస్యలను మేము తొలగించాము. తద్వారా మా వేదికలో ‘టెన్షన్ లేని ఇన్సూరెన్స్’ అని మేము ఇచ్చిన హామీని మా ఉత్పత్తిలో నిలబెట్టుకున్నాము. ఉత్తర, దక్షిణ భారత మార్కెట్లకు రెండు వేర్వేరు క్యాంపెయిన్ లతో మా వినియోగదారులతో స్థానిక భాషలో కనెక్ట్ అయ్యేలా స్థానికీకరణ కంటెంట్ ను నడిపించే మా బ్రాండ్ పద్ధతిని కూడా మేము అలాగే కొనసాగించాము.”
ఉత్తర భారత మార్కెట్లలో విడుదల చేసిన యాడ్ ఫిలింలను ఇక్కడ చూడండి:
యాడ్ ఫిలిం 1 హిందీ, మరాఠీ, బెంగాలీ లలో
యాడ్ ఫిలిం 2 హిందీ, మరాఠీ, బెంగాలీ
దక్షిణ భారత మార్కెట్ల లో విడుదల చేసిన యాడ్ ఫిలింలను ఇక్కడ చూడండి:
యాడ్ ఫిలిం 1 తమిళం, మలయాళం, తెలుగు, కన్నడ
యాడ్ ఫిలిం 2 తమిళం, మలయాళం, తెలుగు, కన్నడ
PhonePe పరిచయం:
2015 డిసెంబర్ నెలలో స్థాపించబడిన PhonePe భారతదేశపు అతిపెద్ద పేమెంట్ల యాప్ గా అవతరించింది. వినియోగదారులు, వ్యాపారులు లాంటి వారిని డిజిటల్ మార్గంలో మేళవించే వీలు కల్పించింది. 40 కోట్లు (400 మిలియన్లు)కు పైగా రిజిస్టర్డ్ వినియోగదారులను కలిగిన PhonePeను ప్రస్తుతం ప్రతి నలుగురు భారతీయులలో ఒకరు ఉపయోగిస్తున్నారు. అంతేకాక, దేశంలోని 99శాతం పిన్ కోడ్లను కవర్ చేస్తూ, ద్వితీయ, తృతీయ, నాలుగో శ్రేణి, అంతకన్నా చిన్న పట్టణాలలోని 3.2 కోట్లు (320 మిలియన్లు) ఆఫ్ లైన్ మర్చంట్లను కూడా ఈ సంస్థ డిజిటల్ మయం చేసింది. 2017లో ఆర్థిక సేవల రంగంలోకి అడుగు పెట్టిన PhonePe 24 క్యారెట్ల బంగారాన్ని కొనేందుకు సురక్షితమైన, సులభమైన మార్గాన్ని అందిస్తోంది. తన వేదికలో ఇటీవల వెండి కొనుగోలును కూడా ఆవిష్కరించింది. అప్పటినుండి, పన్ను ఆదా ఫండ్లు, లిక్విడ్ ఫండ్లు, అంతర్జాతీయ ప్రయాణ బీమా, జీవిత బీమా, కొవిడ్-19 బీమా లాంటి అనేకమైన మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్ ఉత్పత్తులను PhonePe ప్రవేశపెట్టింది. PhonePeను ఉపయోగించి, వినియోగదారులు డబ్బు పంపడం, అందుకోవడం, మొబైల్, DTH రీఛార్జ్ చేయడం, దుకాణాలలో పే చేయడం, తమ వినియోగ పేమెంట్లు అన్నిటినీ చేయడం లాంటివి కూడా చేయవచ్చు. PhonePe ఇటీవల ట్రస్ట్ రిసెర్చ్ అడ్వైసరీ (TRA) విడుదల చేసిన బ్రాండ్ ట్రస్ట్ నివేదిక 2022లో డిజిటల్ పేమెంట్లకు అత్యంత నమ్మకమైన బ్రాండ్ అనే గుర్తింపును దక్కించుకుంది.