Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డచ్ బ్యాంక్ అంచనా
న్యూఢిల్లీ : భారత్లో ధరలు ఎగిసిపడనున్నాయని అంతర్జాతీయ సంస్థలు హెచ్చరిస్తున్నాయి. ప్రస్తుత ఏడాది సెప్టెంబర్లో వినియోగ దారుల ద్రవ్యోల్బణం సూచీ 7.4 శాతానికి ఎగిసి ఐదు నెలల గరిష్ట స్థా యి వద్ద నమోదు కానుందని డచ్ బ్యాంక్ అంచనా వేసింది. ఆగస్టులో ఇది 7 శాతంగా నమోదయ్యింది. ఆర్బీఐ అంచనాల కంటే దేశంలో అ ధిక ద్రవ్యోల్బణం నమోదవుతుందని డచ్ బ్యాంక్ చీఫ్ ఎకనా మిస్ట్ కౌషిక్ దాసు పేర్కొన్నారు. అహార, కూరగాయల ధరలు మరింత పెరగ నున్నాయన్నారు. వచ్చే అక్టోబర్లో సీపీఐ 7 శాతంగా, డిసెంబర్లో 6.4 శాతంగా ఉండొచ్చని ఈ బ్యాంక్ అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం స్థూలంగా 6.9 శాతంగా ఉండొచ్చని.. ఇది ఆర్బిఐ వేసిన 6.7 శాతం అంచనాల కంటే ఎక్కువని తెలిపింది.