Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : చౌక ధరల విమానయాన సంస్థ స్పైస్‌జెట్ తమ పైలట్లకు జీతాలు పెంచినట్టు తెలుస్తోంది. తమ వ్యాపారం మెరుగు పడుతున్న క్రమంలో వచ్చే అక్టోబర్ నుంచి పైలట్లకు 20శాతం జీతం పెంపునకు అంగీకరించిందని ఓ ఆంగ్ల మీడియా వెల్లడించింది. సంస్థలోని కెప్టెన్లు, సీనియర్ ఫస్ట్ ఆఫీసర్లకు జీతం దాదాపు 20 శాతం పెరుగుతుందని పేర్కొంది.